‘దిశ’ ఘటనను కాన్సెప్ట్‌గా దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సినిమా

 
వివాదాస్ప‌ద   దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇప్పుడు దిశ ఘ‌ట‌న‌ని ఆలంబ‌న‌గా చేసుకుని ఓ సినిమా ర‌డీ చేస్తున్నాడు. ఏపి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన దిశ చ‌ట్టంపైనా ఇందులో చ‌ర్చించేందుకు సిద్ద‌మ‌వుతు, ఈ చిత్రంలో ఓ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్‌, ఓ పోలీసు పాత్ర‌ని సిద్దం చేసిన‌ట్టు స‌మాచారం.ఇప్ప‌టికే  ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని, ఈ క్ర‌మంలోనే దిశ కేసులో  నిందితుడైన చెన్నకేశవులు భార్యను రాంగోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితమే కలిసి ఆత‌ని నేప‌థ్యం తెలుసుకున్నార‌ని, అలాగే   ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల ఏం చేసారు, ఎన్‌కౌంట‌ర్‌కి సంబంధించిన  వివ‌రాల‌ను శంషాబాద్ ఏసిపిని  క‌ల‌సి తెలుసుకున్నారు. 

కాగా ఈ సినిమాకు సంబంధించి బాధితుల‌ కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసు కోవాల్సిన అవసరం లేదని, స‌మాజంలో జ‌రిగే ఏ ఘ‌ట‌న‌నైనా సినిమా తీసేందుకు త‌న‌కు  స్వేచ్ఛ ఉందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించ‌డం విశేషం.  తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన  దిశ ఘ‌ట‌న‌, ఆపై  నిందితులను కాల్చి చంపిన ఘ‌ట‌న  తెలుగు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.  ఈ  క్ర‌మంలోనే వైసిపి స‌ర్కారు 21 రోజుల‌లో శిక్ష అంటూ తీసుకువ‌చ్చిన దిశ చ‌ట్టాన్ని కూడా త‌న సినిమా కోసం వాడేసుకునేలా  ‘దిశ’ ఘటనను  కాన్సెప్ట్‌గా ఎంచుకున్నార‌ని స‌మాచారం.  మ‌రి వ‌ర్మ ఈ సినిమా ఎలాంటి వివాదాలూ లేకుండా తీస్తారో? ల‌ఏదో చూడాలి. 

 

Leave a Reply

Your email address will not be published.