పింక్ రీమేక్‌తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖరారు…

పింక్ రీమేక్‌తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖరారు అయ్యిన విషయం విదితమే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సోమవారం నుంచి మీదకు వెళ్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోలో ఓ కోర్టు సెట్ నిర్మించారు. అందులోనే ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందని సమాచారం.
కాగా ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సిద్దమయ్యారు. ఈ సెట్ల పరిశీలనకు వచ్చిన ఆయన గుబురు గడ్డం రఫ్ లుక్ లో కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. పింక్‌లో ఆయన రూపం ఇలా ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 20 రోజుల కాల్షీట్స్ ఇవ్వటంతో ఏక బిగిన షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం వివిధ లొకేషన్లు, అది కూడా హైదరాబాద్‌లోనే ఎంపిక చేసినట్టు తెలియ వచ్చింది. దిల్ రాజు, బోనికపూర్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది.