ర‌వితేజ క‌ష్టాలు చివ‌ర‌కు ఏమ‌వుతాయో?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం‘డిస్కో రాజా’. గ‌తంలో కంటే ర‌వితేజ క్రేజ్ టాలీవుడ్‌లో కాస్త త‌గ్గింది. రాజా ది గ్రేట్ హిట్ అయినా.. తర్వాతనేల టికెట్, టచ్ చేసి చూడు డిజాస్టర్స్ తర్వాత వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా మొదలెట్టాడు. ఈ సినిమా మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు.. ఆ సినిమా విషయంలో చాలా నెగెటివ్ న్యూస్ లే బయటికి వచ్చాయి. ఇక ఈ నెలలోనే విడుదల కావాల్సిన డిస్కో రాజా సినిమా కొన్ని కారణాల వలన జనవరి 24 కి వాయిదా వేశారు. అప్పుడప్పుడు పోస్టర్స్ తోనూ సింగిల్స్ తోనూ హడావిడి చేస్తున్న డిస్కో రాజా టీం..ఇప్పుడు సినిమాని మరోసారి వాయిదా వేసే యోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.


ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన డీఐతో ర‌వితేజ శాటిస్ఫై అవడం లేదని…అందుకే డీఐ మ‌ళ్లీ చేయాల్సివ‌స్తోంద‌ని.. చెబుతున్నారు. ఇక దానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం కనబడడంతో.. ఎంత త్వరగా పూర్తి చేసినా.. సినిమాని జనవరి 24 కి విడుదల చెయ్యడం కష్టముగా భావిస్తున్నారట. రెండు డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ.. ఈసారి పక్కా హిట్ కొట్టాలని.. డిస్కో రాజా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే అన్నిటిలో పర్ఫెక్షన్ ఉండాలని.. సినిమా విడుదల లేట్ అయినా పర్వాలేదని టీం కి చెబుతున్నాడట. ఇక సినిమాని జనవరి 24 నుండి మరో వారం పోస్ట్ పోన్ చెయ్యాలని.. అందుకే జనవరి 31 లాక్ చేద్దామని భావిస్తున్నారట. అది కాకపోతే మరో డేట్ అయినా చూసి పెట్టుకోవాలనే ఆలోచనలో డిస్కో రాజా టీం ఉందట.

Leave a Reply

Your email address will not be published.