స‌త్య‌రాజ్ ఎమ‌ర్జ‌న్సీ ఫ‌స్ట్ లుక్‌‘బాహుబలి’, ‘ప్రతిరోజూపండగే’   చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న స‌త్య‌రాజ్  ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  త‌మిళ  చిత్రం‘తీర్పుగళ్‌ విర్కపడుమ్‌`ను  హనీబి క్రియేషన్స్ పతాకంపై మీరాసాహిబ్ రాథర్ `ఎమ‌ర్జెన్సీ` పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. కాగా  ఈ మూవీ ఫస్ట్ లుక్ ని దర్శకుడు మారుతి త‌న ట్విట్ట‌ర్ ద్వారా మంగ‌ళ‌వారం విడుదల చేశారు.  


ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ  తమిళ చిత్రానికి స మొదటి సారిగా అగ్రశ్రేణి కెమెరాల‌తో  యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించ‌డంవిశేషం.  ధీరన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌ కుమార్తెగా స్మృతి వెంకట్‌ నటిస్తోంది.  కాగా ఇప్పుడు ఈ చిత్ర  డబ్బింగ్ శ‌ర‌వేగంగా  పూర్త‌యింది.  నిర్విరామంగా దాదాపు 12 గంటల పాటు  సత్యరాజ్ డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు  

Leave a Reply

Your email address will not be published.