రొమాంటిక్‌గా మారిన పూరి కుమారుడు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశారు.

కాగా పూరి జగన్నాధ్ తనే స్వయంగా అందించిన స్క్రిప్ట్ తో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. ‘రొమాంటిక్’ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ‘గాయత్రీ భరద్వాజ్’ అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.