గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు
17 – 01 – 2019

01 చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సైంధవుడి లా దాపురించాడు – ప్రస్తుత భాజపా నేత కన్నా …

సైంధవుడు సొంతూరు గుజరాతని ఎవరన్నా చెప్పండ్రా ఆయనకి – లేపోతే ఆల్రెడీ చెదలు పట్టిన చరిత్రకి మరింత పట్టిస్తాడు.. !!

02. చంద్రబాబు కాకిలా బ్రతుకుతాడే గానీ – హంసలా బ్రతకటం చేతకాదు – ప్రస్తుత భాజపా నేత కన్నా …

మరేం – హంస కలిసున్న వాటిని విడదీస్తుంది – కాకి పితృదేవతలకి పుణ్యలోకప్రాప్తి కలిగిస్తుంది – ఏది బెటరంటావ్…??

03. ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటు దిశగా కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం – జగన్ …

మరేం –  ఫెడరల్ పేరుతో తీర్థ యాత్రలు చేసి సెంటరోడికి ఫీడుబ్యాకిచ్చి రావటం అనేది మామూలు కృషా …?? మా సెడ్డ కష్టంలే అన్నాయ్…!!

04. కొత్తగా తీసుకొచ్చిన 10% రిజర్వేషన్లు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా అమలయ్యేలా చూస్తాం – కేంద్రం …

సగం సంకనాకిపోయిన విద్యా వ్యవస్థని మరింత నాకించటానికి కృషి చేస్తామంటారు – అంతేగా …!!

05. జగన్ ఆంధ్ర ద్రోహుల ఫ్రంటుతో జత కడుతున్నారు – లోకేష్ …

మరేం – మనం చేస్తేనే సంసారం – మరొకడు చేస్తే మరేదేనోనని – ఎగేసుకెళ్ళి కాంగ్రేసుని వాటేస్కున్న రోజేమయిందీ…??

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

Leave a Reply

Your email address will not be published.