‘క‌రోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ తో సినిమా

తాజాగా ప్ర‌పంచాన్నిగ‌జ‌గ‌జ‌లాడుస్తున్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు స్టాక్ మార్కెట్లే కాదు.. సినిమా ప‌రిశ్ర‌మ ని కుదేలెత్తిస్తున్నా  ఎన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నా…. క‌రోనా పై  ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు నిర్మాత‌లు . క‌రోనా అనే వ‌చ్చేలా టైటిల్స్‌ను రిజిష్ట‌ర్ చేయించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ముందుగా ‘క‌రోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించుకోవ‌టంతో సంచ‌ల‌న‌మైంది.
 
ప్ర‌స్తుతం  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు కూడా జ‌రుగుతున్న‌ట్టు  స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తామ‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు మీడియాకు తెలిపారు.

ఇండియ‌న్ సినిమాపై క‌రోనా వైర‌స్ పెద్ద ప్ర‌భావాన్నే చూపుతుంది. స్టార్ హీరోల సినిమాల‌న్నీ వాయిదా ప‌డుతుండ‌గా  సినిమా థియేట‌ర్స్ , పాఠ‌శాల‌ల‌ను బంద్ చేయాల‌ని సూచించడంతో ఈ నెల 31 వ‌ర‌కు అన్ని దాదాపు బంద్ కానున్నాయి. దీంతో  ఉగాదికి రావాల్సిన‌ సినిమాల‌న్నీ వాయిదా ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే  సినిమా బిజినెస్ పై ప్ర‌భావం చూపిన క‌రోనా రానున్న రోజుల్లో  క‌లెక్ష‌న్స్‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేక పోలేదు.  

 

Leave a Reply

Your email address will not be published.