వేసవి వేడెక్కే తరుణం!!

సమ్మర్ సీన్ ఎలా ఉంటుందో చాలా ముందుగా వాతావరణంలో మార్పు చెబుతోంది. అయితే స్కూల్స్, కాలేజ్ లకు మార్చి- ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల సీజన్ కాబట్టి సినిమాల రాక తక్కువే ఉంటుంది. మార్చిలో సినిమాల విడుదల అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏప్రిల్ లోనూ కొంత కష్టమే అయినా.. ఈసారి ఏప్రిల్ లో పలువురు కథానాయకులు నటించిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే మజిలి, ఆ తర్వాత వారం చిత్రలహరి చిత్రాలను విడుదల చేసేందుకు కొన్ని నెలల క్రితమే డేట్లు ఫిక్స్ అయ్యాయి. ఆ రెండు చిత్రాలు సమ్మర్ను ప్రారంభించబోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఈ రెంటికి తోడు మరో రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. మజిలీ, చిత్రలహరి చిత్రాలతో పాటు అవే తేదీల్లో జెర్సీ, కాంచన 3 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈరెండు చిత్రాలు మొదట ఏప్రిల్ 19న విడుదల చేయాలని భావించారు. అయితే ఏప్రిల్ 25న మహేష్ మహర్షి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో రిలీజ్ తేదీ మారింది.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మహర్షి ఈ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ రిలీజవుతోంది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమా పై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా మహేష్ కెరీర్ లోనే  భారీ ఎత్తున మహర్షిని విడుదల చేయాలని భావిస్తున్నారు. మహర్షి కోసం ఇప్పటికే దాదాపుగా 80 శాతం థియేటర్లను బ్లాక్ చేశారు. ఈ సినిమా కోసం ఇతర సినిమాల రిలీజ్ తేదీల్ని మార్చుకునే సన్నివేశం ఉందని చెబుతున్నారు.  నాని జెర్సీ, లారెన్స్ కాంచన 3 చిత్రాల రిలీజ్ తేదీల గురించి నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉందింకా. ఈ సీజన్ లో మజిలీ, చిత్రలహరి చిత్రాల్ని ఎలాంటి ఇబ్బ ంది లేకుండా తెలివైన ప్లానింగ్ తో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద భారీగానే సందడి కనిపించబోతుంది. ఈ నాలుగు సినిమాలతో పాటు మరో రెండు మూడు చిన్న చితకా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సీజన్ విజేతలు ఎవరు.. అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.