పార్టీ మారే ఆలోచ‌న లేనే లేదు – టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి

త‌ను పార్టీ మారుతానంటూవ‌స్తున్న వార్త‌ల‌ని చీరాల ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కొట్టి పారేసారు. పార్టీ నుంచి ప‌లువ‌రు వైసిపిలో చేరుతుండ‌టంతో గొట్టిపాటి సైతం ఎమ్మెల్ల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి వైసిపి బాట ప‌డుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన గొట్టిపాటి లాబీల్లో క‌ల‌సిన మీడియాతో పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తున్నవ‌రుస క‌థ‌నాల‌పై స్పందించారు. త‌న‌కు పార్టీ మారే ఆలోచనే లేదని, బయట ఉద్దేపూర్వ‌కంగా త‌న‌పై అన‌వ‌స‌ర‌ ప్రచారం  చేస్తున్న‌ట్టు ఆరోపించారు. అస‌లు నాకు పార్టీ మారే ఆలోచన లేదు. రాదు కూడా అని స్ప‌ష్టం చేసారు.  
మా నాన్నహయాం నుంచి క్వారీ వ్యాపారం చేస్తున్నామ‌ని, ఎలాంటి ఆరోప‌ణ‌లు లేకుండానే  నా క్వారీల్లో అధికారులు తనిఖీలు చేశార‌ని, అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని, వ‌త్తిళ్లు తెస్తున్నార‌ని, ఇలా ఎన్ని దాడులు జరిపినా పార్టీ మారాలంటూ నాపై ఎన్ని వ‌త్తిళ్లు చేసినా నా వైఖరిలో మార్పు ఉండ‌బోద‌ని తేల్చి చెప్పారు గొట్టిపాటి.

Leave a Reply

Your email address will not be published.