మండలి రద్దు అంత ఈజీ కాదు ….

జగన్ సర్కారు మండలి రద్దు దిశగా చేస్తున్న ఆలోచనలపై ఏపీ  టిడిపి నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికిప్పుడు మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు మండలికి డబ్బు ఖర్చు అంటున్నారు మరి అసెంబ్లీని నడపటానికి ఏడాదికి 150 కోట్లు ఖర్చు అవుతుంది అసెంబ్లీని కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు శాసన మండలి రద్దు జగన్ సర్కార్ చేతిలో లేదని కేవలం మండలిని రద్దు చేస్తున్నట్లు సిఫార్సు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం కు పంపించే వరకు అధికారం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉందని గుర్తు చేశారు పార్లమెంటు ఉభయసభల ముందు పెట్టి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళుతుందన్నారు అప్పుడు నోటిఫికేషన్ జారీ అవుతుంది అన్నారు ఇప్పటికే  రాష్ట్రాలనుంచి వచ్చిన అనేక  తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగు లో  ఉన్నాయని యనమల గుర్తు చేస్తున్నారు మండలి రద్దుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుంది రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చే వరకు మండలి కొనసాగుతున్న ఉంటుందని తెలిపారు కాబట్టి 3 రాజధానుల బిల్లుపై ఏర్పాటు చేసిన  సెలెక్ట్ కమిటీ తన  తాను చేసుకుపోతుంది అని చెప్పారు వాస్తవానికి ఆర్టికల్ 169 కింద మండలి రద్దుకు  తీర్మానం ప్రతిపాదించి ఆమోదించాలి అంటే కచ్చితంగా ప్రతిపక్షం సభలో ఉండాలని ప్రతిపక్షం లేకపోవడం వల్లే గురువారం ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకు వెళ్ళ లేదని చెప్పుకొచ్చారు.  

Leave a Reply

Your email address will not be published.