చెందు ముద్దు ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం `ఓ పిట్టకథ`

అతి తక్కువ నిడివితో పెద్ద పెద్ద విషయాలను చెప్పే పిట్టకథలు చాలా ఇంట్రస్టింగా ఉంటాయి. అలాంటి పిట్టకథను సెల్యులాయిడ్ మీద చూపించే ప్రయత్నం చేసింది. భారీ కమర్షియల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భవ్య క్రియేషన్స్ . చెందు ముద్దు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి `ఓ పిట్టకథ` అనే టైటిల్ ఖరారు చేస్తూ, మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ “ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. దర్శకుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెపితే అందులో `ఓ పిట్టకథ` నాకు బాగా నచ్చింది ఈ టైటిల్. `ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ` అనే క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అంతవరకే నా కంట్రిబ్యూషన్. అని చెప్పారు.
చిత్ర నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ “ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణతో `పైసా వసూల్`, టాప్ హీరో గోపీచంద్‌తో `శౌర్యం`, `లౌక్యం`,`సౌఖ్యం` ఇలా వరుస కమర్షియల్ చిత్రాలు చేపిర మా బ్యానర్‌పై కొత్తవారిని ప్రోత్సహించేలా తేజతో `నీకు నాకు డాష్ డాష్` చిత్రాన్ని చెసానని, తాజాగా చెందు ముద్దు చెప్పిన ఓ చిన్న కథ నచ్చి తెరకెక్కించేందుకు సిద్దమయ్యా. ఇందులోనూ అంతా కొత్తవాళ్లే చేస్తున్నారు. పోస్టర్ రిలీజ్ చేసిన మాటల మాంత్రికుడు, సక్సెస్ఫుల్ డైరక్టర్ త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు“ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మాట్లాడుతూ “ మా `ఓ పిట్ట కథ`. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అని చెప్పారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ “గ్రామీణ ప్రాంత కథాంశమిది. . ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తుంది.ఆధ్యంతం థ్రిల్లింగ్ తో కూడిన ట్విస్టులున్నాయి. చిత్రానికి. స్క్రీన్ ప్లే ప్రధానం అన్నారు.
ఈ సమావేశంలో చిత్ర నటులువిశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు పాల్గొన్నారు.