కోడి రామకృష్ణ మరణం తీరని లోటు – నందమూరి బాలకృష్ణ

సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణగారు అనారోగ్యంతో కన్నుమూయడం ఎంతో బాధాకరం. శతాధిక దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు చిత్ర సీమకు అందించారాయన. ఎమోషనల్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో కోడి రామకృష్ణగారు ముందు వరుసలో ఉంటారు. అలాగే ఆయన వైవిధ్యమైన చిత్రాలను కూడా అందించారు. ట్రెండ్‌కు తగినట్లు గ్రాపిక్స్ చిత్రాలను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో కలిసి మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు చిత్రాలకు పనిచేశాను. ఇలాంటి గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.