కరెన్సీ నోట్ల ద్వారా కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్… కరెన్సీ నోట్ల ద్వారా కూడా వ్యాపిస్తోందంటూ సామాజిక మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై అంతా అవాక్కవుతున్నా, ఇందుకు గతంలో ‘ఈ-కొలి’ బ్యాక్టీరియా ‘సాల్మొనెల్లా టఫి’ బ్యాక్టీరియాలు ఇలా నోట్ల ద్వారానే వ్యాపించినట్టు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు వైద్యులలోనూ తెగ ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా కరోనా కూడా అంటు వ్యాధి కావటం, అనేక మంది చేతులు మారుతుండే కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఇది గత వైరస్ల మాదిరే వ్యాపించే అవకాశం ఉన్నట్టువినిపిస్తోంది. 2018లో చేపట్టిన ఒక అధ్యయనంలో కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను పరిశీలించిన ఓ బృందం రూ.100, 50, 20, 10 నోట్ల నుంచి ఈ- కొలీ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫి, మరో రెండు ఇతర వైర్‌సలు వ్యాప్తి చెందినట్టు గుర్తించడాన్ని నెటిజన్లు ఉదాహరణలు గా చూపుతుండటంతో కొంతమంది శాస్త్రవేత్తలు మరోమారు కరోనా వ్యాప్తిపై తమ పరిశోదనలు చేస్తుండటం గమనార్హం.