వెచ్చే నెలలో వరుస సెలవులతో ఐదు రోజులు బ్యాంకు ల బంద్…

 

మార్చి రెండో వారంలో అనేక బ్యాంకులు ఏటీఎం లు వరుసగా ఐదు రోజులు మూసివేయొచ్చు. బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ), ఆల్  ఇండియా బ్యాంక్  ఎంప్లొయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకారం, భారత్ బ్యాంకుల సంఘంతో వేతన సవరణ చర్చల తర్వాత మార్చ్ 11 నుండి 13 వరకు 3 రోజుల సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. ఇక , 14న రెండో శనివారం, ఆ వెంటనే ఆదివారం రావడంతో… వరుసగా ఐదు రోజులు బ్యాంకు కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి . 

ఇక, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ  బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి… భారత్ బంద్ సందర్బంగా జనవరి 8న బ్యాంకింగ్ సేవలను కూడా ప్రభావితం అయ్యాయి. ఈ ఈఏడాది ఇపటివరకు ఇది మూడవ బ్యాంక్ సమ్మె కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి యూనియన్లు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి….. వెచ్చే నెలలో వరుస సెలవులతో బ్యాంకు ల బంద్ 

Leave a Reply

Your email address will not be published.