హాకీ బ్యాక్ డ్రాప్‌లో తొలి తెలుగు చిత్రం

యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా   ‘లావణ్య త్రిపాఠి’ నాయిక.గా హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం  `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా గా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ సంయుక్తంగా  రూపొందుతున్న ఈ సినిమాకి టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మాత‌లు. ఇప్ప‌టికే  షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమాకు  ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌కుడు  కాగా  . ‘హిప్ హాప్ త‌మిళ’ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. . వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్నిబుధ‌వారం   యు ట్యూబ్ ద్వారా చిత్ర మూనిట్ విడుద‌ల చేసింది.  . ‘సింగిల్ కింగులం’ అనే పేరుతో విడుదల అయిన ఈ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించారు.  గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ గాత్రంలో కదం తొక్కిన ఈ గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్యాలు యువతను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు సందీప్ కిషన్ నాయిక లావణ్య త్రిపాఠి తో కలసి ఆడి పాడిన ఈగీతం ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published.