చిరంజీవి టైటిల్ ‘మాస్టర్స’ తో విజ‌య్త‌మిళ‌నాట వ‌రుస విజ‌యాలందుకుంటున్న విజ‌య్ తాజాగా చిరంజీవి టైటిల్ ‘మాస్టర్స తో మ‌రో సినిమా ఆరంభించాడు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు అరవై శాతం పూర్తి చేసిన విజ‌య్ తన తదుపరి ‘తలపతి 65’ కోసం సందడి అప్పుడే ఆరంభించేసారు. మ‌రోవైపు కొత్త దర్శకుల తో సినిమాలు అంగీక‌రిస్తునే, సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో చిత్రాల‌కు క‌మిట్ అయ్యేందుకు స్క్రిప్ట్‌లను వినడం ప్రారంభించాడు. ఇప్ప‌టికే A.R. మురుగదాస్, పాండిరాజ్, పెరరాసు, మాగిజ్ తిరుమేని, లోకేష్ కనగరాజ్, కార్తీక్ తంగవేల్ విజయ్ కి స్క్రిప్ట్స్ చెప్పిన వారిలో న్నారు. 

కాగా ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ద‌ర్శ‌కురాలు సుధ కొంగర వినిపించిన క‌థ విజ‌య్‌కి బాగా న‌చ్చింద‌ట‌. అంతే అంగీక‌రించేయ‌టంతో ఈ చిత్రం సన్ పిక్చర్స్ నిర్మించే ప‌నిలో ప‌డింది. మాధవన్ నటించిన ‘ఇరుధి సూత్రు’ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించగా బాక్సాఫీస్‌ని కొల్ల‌గొట్టింది తాజాగా ఈ ద‌ర్శ‌కురాలు సూర్య‌తో ‘ సూరరై పొట్రూ ‘ చిత్రాన్ని పూర్తి చేయ‌గా… అది సమ్మర్ బాక్సాఫీస్ యుద్ధంలో విజయ్ ‘మాస్టర్ నే ఢీకొన‌బోతోంది. ఈ ద‌ర్శ‌కురాలి టేకింగ్ స్ట్పైల్ మెచ్చి విజ‌య్ ఆమెతో సినిమా చేసేందుకు సై అన్నాడ‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.