ఘనంగా అమ్మ పుట్టిన రోజు

ఆయన వెండితెర ఇలావేల్పే… అభిమాన గణానికే కాదు టాటీవుడ్లో మెగాస్టారే… ఎందరో నటులకు స్ఫూర్తి ప్రదాత… ఆయనే మన సుప్రీం హీరో చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ లాంటో మహోన్నత నటుడుని ఇచ్చిన ఆతని తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడులు చిరంజీవి. ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల మధ్య తల్లి చేత కేక్ కటింగ్ చేయించి, శుభాకాంక్షలందించడంతో పాటు ఆమె ఆశీస్సులు అందుకున్నారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక షేర్ చేసుకోవటంతో ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇందులో అంజనా దేవితో.. కుమారుడు చిరంజీవి సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒక్కటే ఎందరో అభిమానులను కట్టిపడేస్తోంది.
ఈ ఫొటోలలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మెగా సిస్టర్స్ కూడా ఉన్నారు అమ్మ పుట్టిన రోజు న చిరంజీవి ఆమెతోనే సరదాగా గడిపాడు మనవళ్లు, మనవరాళ్లు, కొడుకుతో కలిసి అంజనా దేవి కూడా ఈ వేడుకలో చాలా ఉత్సాహంగా కనిపించడం విశేషం.