జెట్‌ ఎయిర్‌ వేస్ దక్కేదెవ‌రికి?

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు దేశీయ విమాన రంగంలో త‌న‌దైన మార్కు చూపిస్తూ వెలుగు వెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ రూ.8,500 కోట్లకుపైగా అప్పులు పాలై చివ‌రి త‌న‌ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసే ప‌రిస్థితికి దిగ‌జారి ఇప్పుడు అప్పులు తీర్చేందుకు విమానాల‌ను అమ్మ‌కానికి పెట్టింది. దీంతో జేట్‌ ఎయిర్‌వేస్ మార్కు త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని భావిస్తున్న ప‌లు సంస్ధ‌లు దీనిని చేజిక్కించుకునేందుకు  ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
రుణ సంక్షోభం పెరిగిపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్  2019 సంవత్సరం ఏప్రిల్‌ నెలలో త‌న‌ విమాన సేవలను నిలిపివేయ‌టంతో ఆ సంస్థ‌కు  రుణాలు అందించిన ప‌లు సంస్ధ‌లు, బ్యాంకులు తమ రుణాలను రాబట్టుకునేందుకు దివాల పరిష్కర చర్యలను చేపట్టి ట్రిబ్యున‌ల్‌ని ఆశ్ర‌యించాయి.  దీనిలో భాగంగా జెట్‌ దివాలా పరిష్కరంలో భాగంగా ట్రిబ్యునల్‌ ఇచ్చిన మొదటి 180 రోజుల గడువు ముగిసింది. దీంతో  మ‌రోమారు ట్ర‌బ్యున‌ల్ ఆశ్ర‌యించిన జెట్ ఎయిర్‌వేస్‌, ఇప్పటి వరకు సినర్జీ గ్రూప్ ఒక్క‌టి మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసిందని, త‌మ సంస్ధ‌ కొనుగోలు చేసేందుకు మరింత సమయం కావాలని కోరింద‌ని తెలిపింది. దీంతో ట్రిబ్యునల్‌ మరో 90 రోజుల గడువు ఇవ్వ‌టంతో సీఓసీ కొత్త బిడ్ల దరఖాస్తులకు ఆహ్వానాలు పలికింది.  జెట్‌ను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని విమానయాన దివాల పరిష్కార నిపుణుడు ఆర్‌పీ ఆశిష్ చావ్‌చరయా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తెలిపారు.  కొత్త బిడ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే సీఓసీనీ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆదేశించింది. నిన్న ఈ సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు కంపెనీ ఇచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు చేయాలనుకునేవారు జవనరి 6కల్లా ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేయాలని, ఫిబ్రవరి 8 నాటికి దివాలా పరిష్కర ప్రణాళికను సమర్పించాలని పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన టర్బో ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ   జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలుపై సాధ్యాసాధ్యాలను పరిశీస్తోంది.  మ‌రోవైపు  ట్రూస్టార్‌ పేరుతో వచ్చే ఏడాది విమాన సేవలను ప్రారంభించాలనుకోంటోన్న టర్బో ఏవియేషన్ కూడా రంగంలోకి దిగింది. ఇందుకోసం 10 రోజుల కిందట బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.10 కోట్ల రుణం అందుకున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది.
అలాగే మొదట్లో జెట్‌ఎయిర్‌వేస్‌లో ఆర్థిక అవకతవకలపై కేసు నడుస్తున్న నేపథ్యంలో హిందుజా కంపెనీ దీనిని టేకోవ‌ర్ చేయాల‌ని భావించినా అప్పుల‌ను చూసి కాస్త వెన‌క్కి త‌గ్గింది. అయితే తాజా కాంపిటేష‌న్‌తో హిందుజాలు కూడా జెట్ ఎయిర్‌వేస్‌పై దృష్టిసారించారు. గ‌తంలో ఎయిర్‌వేస్‌ రుణదాతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు, హిందూజా గ్రూప్‌ను కూడా సంప్రదించిన నేప‌థ్యంతో తాజాగా ఫ‌లితం త‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌ని ఆ సంస్ధ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.