సాక్షి పత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ పరువు నష్టం దావా

శనివారం ఉదయం విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో లోకేష్ దావా దాఖలు చేశారు. సాక్షి పత్రికపై లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వాజ్యం దాఖలైంది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా సాక్షి పత్రికలు తప్పుడు కథనం ప్రచురించారని లోకేష్ పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 22న సాక్షిలో చినబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో కథనం ప్రసారం అయ్యింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్… సాక్షి పత్రికపై పరువునష్టం దావా దాఖలు చేశారు.