శౌర్య కెరీర్‌లోనే ‘అశ్వ‌ధ్దామ’ బెస్ట్ సినిమా గ నిలిచిపోతుంది


నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాడ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ‘ చిత్రం జనవరి 31న విడుదలై దిగ్విజయంగా ప్రదర్శితమవుతున్న త‌రుణంలో . శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘‘ ఇప్ప‌టికే ల‌వ్వ‌ర్ బోయ్‌గా మంచి మార్కులేయించుకున్న శౌర్య ఈ సిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. తను కథను రాసాన‌ని చెప్పిన‌ప్పుడు స‌ర‌దాగా అంటున్నాడ‌నుకున్నా… కానీ తిరిగి దాన్ని తెర‌మీద చూస్తే… ఇంత బాగా రాసుకున్నాడా అని నాక‌నిపించింది.. ఇండ‌స్ట్రీలో త‌మ కొడుకుకి విజ‌యం అందితే ఎంత ఆనందం ఉంటుందో దాన్ని నిర్మాత‌ల క‌ళ్ల‌లో చూస్తున్నా అన్నారాయ‌న‌. 

మ‌రో అతిధి డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ: “ రా క్రియేషన్స్ జర్నీ ఆది నుంచి ప‌రిశీలిస్తున్నా ఎలాంటి సినిమా చేసినా, అంద‌రినీ ఓ కుటుంబంలా క‌ల‌సి మెల‌సి ప‌నిచేయించేలా చూసుకోవటం వారిచే కెల్లింది. నేను డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల్లో రెండు శౌర్యతో పనిచేయడం సంతోషంగా ఉంది” అన్నారు. స‌మాజానికి హితం క‌లిగించే మ‌రిన్ని క‌థ‌లు శౌర్య రాయాల‌ని నా సూచ‌న అని అన్నారామె. 

నిర్మాత ఉష ముల్పూరి మాట్లాడుతూ: “శౌర్య కెరీర్‌లోనే అశ్వ‌ధ్దామ నిల‌చి పోవ‌టం ఖాయ‌మ‌న్నారు. సినిమా క‌లెక్ష‌న్లు భాగున్నాయ‌ని, శౌర్య నటన, ఫైట్లుప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించాయ‌ని, త‌మ ఐరా క్రియేషన్స్ కి మంచి హిట్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాల‌న్నారు. మరింత మంచి సినిమాలు అందిస్తాం” అని చెప్పారు.
దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ: “ఈ సినిమా ప్రేక్ష‌కులు ఇంత‌లా ఆద‌రిస్తున్నారంటే శౌర్య నటించిన విధానమే కార‌ణం. సినిమాలో ద‌ర్శ‌కుడిగా నాకు అవ‌కాశం ఇచ్చి నన్ను భాగం చేసినందుకు ధ‌న్యావాదాలు అని అన్నారు. 

హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. “సినిమా విడుద‌లైన రోజు నుంచి చూసిన ప్రతి ఒక్కరూ బాగుందంటూ చెప్ప‌డంతో వల్లే సినిమా పెద్ద హిట్టయిందన్నారు. నాతో తీసినందుకు మా అమ్మకు చాలా రుణ‌ప‌డి ఉంటారు. డైరెక్టర్ రమణతేజ చాలా బాగా ఈ సినిమా తీశాడు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ త‌న కెమెరా పనితనంతో మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. సినిమాకి కేవ‌లం 7 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తిచేసి ఇచ్చిన జిబ్రాన్ ప్ర‌త్యేకంగా థాంక్స్ చెప్పాలి. విలన్ గా చేసిన బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా ని బాగా ఆద‌రించారు. తెలుగుతెర‌పై ఉన్న విల‌న్ల కొర‌త తీరుస్తాడ‌ని అనుకుంటున్నా అన్నారు. త‌న సినీ ప్ర‌స్థానంలో ‘నర్తనశాల’ చేసి ఇబ్బంది ప‌డ్డాన‌ని, అ లాంటి సినిమాల‌ని ఇక ముందు చెయ్యన‌ని నా అధిమానుల‌కు మాటిస్తున్నాన‌ని చెప్పారాయ‌న‌.

Leave a Reply

Your email address will not be published.