సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో పోల్చుకుంటున్న శ్రీ‌రెడ్డి

శ్రీరెడ్డి టాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.  క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద యుద్ధమే చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేసి చెన్నై వెళ్ళింది.  అక్కడే సినిమాలు చేస్తున్నది.   కోలీవుడ్ లో సినిమాల్లో నటిస్తూనే సినిమాలు నిర్మించేందుకు శ్రీరెడ్డి సిద్ధం అయ్యింది.  ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేసింది.  ఇలా కంపెనీని స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి క్యాస్టింగ్ కాల్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.


 ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈమె తెలుగునాట కాస్టింగ్ కౌచ్ వివాదం పేరుతో సంచలనం సృష్టించి, పవన్ కళ్యాణ్ ని అసభ్యంగా బూతులతో తిట్టి చాల పాపులర్ అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూనే, పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని వీలు చిక్కినప్పుడల్లా విమర్శలతో సమయం గడిపేస్తుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా ఆఖ‌రికి వ‌ద్ద‌ల్లేదు. ర‌జ‌నీ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తుంది.


తమిళ రాజకీయాలలో యాక్టీవ్ అయ్యేందుకు శ్రీ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని, వివాదాల్లో తల‌ దూర్చకుండా శాంత స్వభావంతో ఉంటాడని తెలిపింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సొంతగా పార్టీ పెడతారో, లేదంటే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారో అందులోనే చేరతానని, ఆ పార్టీ కే మద్దతిస్తానని తెలిపింది. అంతేకాదు, రజినీకాంత్ కి తనలాగే విపరీతమైన దైవభక్తి అని తెలపటం జరిగింది.


Leave a Reply

Your email address will not be published.