ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ కన్నుమూత

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్…మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ బుధవారం కన్నుమూశారు. 70 సంవత్సరాల వయసు ఉన్న బాబ్ విల్లిస్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్ ఆయన నిన్న తన చివరి శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో క్రికెట్ అభిమానుల్లో తీరని విషాదం నెలకొంది. 90 టెస్టుల్లో 25.20 సగటుతో 325 వికెట్లు తీసిన విల్లీస్ 70వ దశకంలో ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచారు. 64 వన్డేల్లో ఆయన 80 వికెట్లు పడగొట్టారు. 1981లో హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే 8 వికెట్లు తీసిన బాబ్ సంచలన ప్రదర్శన ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. 18 టెస్టుల్లో ఆయన ఇంగ్లండ్‌కు కెప్టెన్ గా వ్యవహరించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక చాలాకాలం పాటు కామెంటేటర్ గా పనిచేశారు. ఈ క్రమంలో నిన్న విల్లీస్ మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు.