టీడీపీ కి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయిగా


తెలుగుదేశం పార్టీకి క‌ర్నూలులో అండ‌గా ఉన్న  కేఈ కృష్ణమూర్తి సోదరుడు.ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇప్ప‌టికే ప‌లు ప‌ర్యాయాలు  ఆయ‌న వైసిపితో మంత‌నాలు జ‌రిపార‌ని  వార్త‌లొస్తున్న క్ర‌మంలో టీడీపీలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు కేఈ ప్రభాకర్ ప్ర‌క‌టించ‌డం  గ‌మ‌నార్హం.  వైసీపీ, బీజేపీ, జనసేన తనకు టచ్‌లో ఉన్నాయని ప్ర‌భాక‌ర్ చెపుతూ వ‌స్తున్నా. ఆయ‌న నేడో రేపో  జగన్ సమక్షంలో వైసిపి తీర్ధం పుచ్చుకోవ‌ట‌మే త‌రువాయ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెపుతున్నాయి.  

 

Leave a Reply

Your email address will not be published.