ఆస్కార్ విజేతలు వీళ్లే

ప్రపంచ సినిమా అత్యున్నత అవార్డు ఆస్కార్ 2019ను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. గ్రీన్ బుక్ ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. రామి మలేక్, ఆల్ఫోన్స్, ఒలీవియో తదితరులకు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌కు ఉత్తమ సహాయనటుడిగా మహేర్షలా అలీకు ఈ ఏడాది ఆస్కార్ వరించింది.

విజేతల వివరాలు..

* ఉత్తమ చిత్రం  గ్రీన్ బుక్
* ఉత్తమ దర్శకుడు  ఆల్ఫోన్సో కారోన్ (రోమా)

* ఉత్తమ నటుడు  రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)

* ఉత్తమ నటి  ఒలీవియా కోల్మన్ (ది ఫేవరెట్)

* ఉత్తమ సహాయ నటి  రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)

* ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ

* ఉత్తమ ఛాయాగ్రహకుడు  అల్ఫాన్సో కరోన్(రోమా)

* ఉత్తమ విదేశీ చిత్రం  రోమా

* ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం  ఫ్రీ సోలో

* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్  బ్లాక్ పాంథర్

* ఉత్తమ సినిమాటోగ్రఫీ  రోమా

* ఉత్తమ క్యాస్టూమ్ డిజైనర్  రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్)

* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్  బెహమైన్ రాప్పోడి
* ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- స్పుడర్ మ్యాన్ : ఇన్‌టూ ది స్పుడర్ వెర్స్

ఆస్కార్ లో భారతీయతకు అవార్డు
91వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ను అవార్డు వరించింది. నెలసరి సమస్యల నేపథ్య ంలోని డాక్యుమెంటరీ ఇది. ఈ నేపథ్యంలో నిర్మాత గునీత్ మోంగాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. హపూర్ ప్రాంతంలోనే ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ సినిమాలో హపూర్‌లోని కథిఖేరా గ్రామానికి చెందిన స్నేహ అనే యువతి కూడా నటించారు. తన కుమార్తె నటించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చిందని ఆమె కుటుంబీకులు సంబరాలు చేసుకున్నారు.

ప్రముఖుల ప్రశంసలు
 మహిళలకు సంబంధించిన ఇలాంటి సమస్యలపై ఇప్పటికీ సమాజంలో చిన్నచూపు ఉంది. ఇప్పుడు ఇదే సమస్యతో తెరకెక్కిన చిత్రం ఆస్కార్ స్థాయికి చేరింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ  రాధికా శరత్‌కుమార్ ట్వీట్ చేశారు. ఆస్కార్ వేడుకలో ఎంతో మధురమైన అనుభూతి. రుతుక్రమం ప్రక్రియపై ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన డాక్యుమెంటరీని ఆస్కార్ వరించింది. భయం అంటే ఏంటో తెలీని నా స్నేహితురాలు గునీత్ మోంగాకి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ తెలిపారు ప్రియాంక చోప్రా.  అక్షయ్‌కుమార్, విక్కీ కౌశల్, పరేష్ రావల్, షబానా ఆజ్మీ తదితరులు దర్శకురాలికి శుభాకాంక్షలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.