తెలుగు ఇండ‌స్ట్రీలో విల‌న్‌గా జిష్సు సేన్ గుప్తా ఎంట్రీ

జగపతిబాబు.. ,  సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి.  ప్రకాశ్ రాజ్ ఇలా ఒక్కో సమయంలో ఒక్కొక్కరు  ప్ర‌తినాయ‌కుల పాత్రంలో ఒదిగిపోతూ తమ సత్తా చూపిస్తున్నారు.  అయితే ఎంతమంది వచ్చినా తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ విలన్స్ కొరత మాత్రం కనిపిస్తూనే ఉంది. ప్ర‌తి సినిమాలో వీళ్లేనా అన్న ఫీల్ ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతున్న త‌రుణంలో తెలుగు ఇండస్ట్రీలోకి  కొత్త కొత్త విలన్స్  వస్తున్నా,  పెద్దగా క్లిక్ కావడం లేదు.
 కానీ తాజాగా   నాగశౌర్య  న అశ్వద్ధామ సినిమాతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ జిష్సు సేన్ గుప్తా    సైకో విలన్ గా అందర్నీ ఆకట్టుకున్నాడు.  దీంతో మరో స్టైలిష్ విలన్ మ‌న‌కి దొరికినట్టే అంటున్నారు సినీ జ‌నాలు.  బెంగాలీ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కెరీర్ ఆరంభించిన జిష్షు మంచి నటుడు గా ఇప్ప‌టికే అక్క‌డ ఓ మార్కు తెచ్చుకున్నాడు. న‌ట‌న‌లో  నేషనల్ అవార్డు కూడా అందుకున్న ఈయన గతేడాది ఎన్టీఆర్ బయోపిక్ లో ఎల్.వి.ప్రసాద్ పాత్రలో నటించినా, ఆ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ కావ‌టంతో  ఈయన్ని గుర్తు పెట్టుకోలేదు ప‌రిశ్ర‌మ‌.
 కానీ  నాగశౌర్య సినిమా కోసం విలన్ గా మారిన  జిష్షు నటన చూసి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా  విడుదలైన నితిన్ భీష్మ  లో కూడా   కార్పోరేట్ విలన్ గా  కుమ్మేయ‌టం చూసిన ప్రేక్ష‌కులు సైతం  ధృవ సినిమాలో అరవింద స్వామి ని గుర్తుకొన్నారంటే అతిశ‌యోక్తి కాదేమో.

జిష్సూ ఇప్ప‌టికే న‌టుడిగా స‌త్తా చూపించాడు. పైగా .  తక్కువ రెమ్యునరేషన్ తోనే చిత్రంలో ప్ర‌ధాన విల‌న్ పాత్ర‌ గుప్తాతో వేగంగా ప‌ని ముగించేయ‌చ్చ‌న్న భావ‌న‌లో నిర్మాత‌లుండ‌టంతో  టాలీవుడ్ క‌న్ను జిస్సుపై  పడింది దాంతో  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా మంచి భవిష్యత్తు ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. కాకపోతే రొటీన్ విలన్ లా కాకుండా కాస్త కొత్తగా ఉండే పాత్రలు ఎంచుకుంటే కచ్చితంగా మరి కొన్ని ఏళ్లపాటు తెలుగు ఇండస్ట్రీకి మంచి ప్రతినాయకుడు దొరికినట్లే.  

Leave a Reply

Your email address will not be published.