బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం లో బాలయ్య…బాలయ్య సినిమా అంటేనే  గ్లామర్ హీరోయిన్లు, అదరగొట్టే ఫైట్లు, అద్భుత‌మైన పాట‌లు అంత‌కు మించి ఓ ఫ్యామిలీ ప్యాక్ గ్యారంటీ సినిమా అనే భావ‌న ప్రేక్ష‌కుల‌లో ఉంది. కానీ ఇటీవ‌ల కొంత కాలంగా ఆయ‌న చేస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతుండ‌టంతో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ,  తాజాగా బోయపాటి శ్రీనివాస్ నేతృత్వంలో హేట్రిక్ మువీని చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అనేక విశేష అంశాలు వినిపిస్తుండ‌టంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే  చిత్ర యూనిట్ మాత్రం సస్పెన్ప్ మెయింటైన్ చేస్తోంది.

కాగా రూలర్ అభిమానుల‌ను సైతం నిరాశ ప‌ర‌చ‌డంతో రెట్టించిన ఉత్పాహం నిపేందుకు ర‌డీ అవుతున్న  బాలయ్య బాబు ఈ చిత్రంలో వైవిధ్య‌భ‌రిత‌మైన రెండు పాత్ర‌ల‌ని పోషిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కొంత కాలంగా గుండుతో ద‌ర్శ‌న‌మిస్తున్న బాల‌య్య‌ వారణాసి అడవులలో అఘోరాగా శివుని భక్తుడుగా, అలాగే సిటీలో ఉండి పేద‌ల‌ను ఆదుకునే యువ‌కునిగా రెండు పాత్ర‌లు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికేఈ పాత్ర‌ల కోసం బాలయ్య 15 కేజీలు తగ్గాడని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రం లో బాల‌య్య స‌ర‌స‌న ఓ పాత్ర కోసం  కేథరిన్ ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. 2020లో మంచి బోణీ కొట్టాలని భావిస్తున్న బాలయ్యని త‌న‌దైన మార్కులో బోయపాటి తీర్చి దిద్ద‌నున్నాడు.

Leave a Reply

Your email address will not be published.