నితిన్ పెళ్లి…పెళ్ళికూతురెవ‌రంటే…!

యూత్ స్టార్ నితిన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వరస ఫ్లాపులు  వచ్చినప్పటికి ఇష్క్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి వరస సినిమాలు చేస్తూ వరస హిట్లు అందుకుంటున్నాడు. దాదాపు అందరి హీరోలతో నటించిన యంగ్ హీరో ఒక్క నితిన్ ఒక్కడే. అయితే ఇప్పుడు ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.

ప్రస్తుతం ’ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ’భీష్మ’ అనే సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. అలానే చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో కూడా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. 2020 లోనే ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే గత కొంత కాలం నుంచి ఓ అమ్మాయితో నితిల్ ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఆమెకు ఇండస్ట్రీతో సంబంధం లేదని సమాచారం.

 2020 ఏప్రిల్ లో నితిన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త బయటికి రాగానే ఆయన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. 


Leave a Reply

Your email address will not be published.