నిధుల‌ని రాబ‌ట్ట‌డంలో వైసీపీ ప్రభుత్వం చ‌తికిల్ల‌బ‌డింద‌

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ని రాబ‌ట్ట‌డంలో వైసీపీ ప్రభుత్వం చ‌తికిల్ల‌బ‌డింద‌ని ఏపి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీ‌కాకుళం జిల్లా రేగిడి ఆముదాల వ‌ల‌స‌లోని త‌న స్వ‌గృహంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప‌లు అవినీతి కేసుల‌లో ఏ1, ఏ2 లుగా ఉన్న జగన్‌, విజయసాయిరెడ్డి వాటి నుంచి కాపాడుకునేందుకు గ‌త 8 నెలల నుంచి కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌ల‌తో అంట‌కాగుతున్నారు మిన‌హా ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిందేంలేద‌ని మండి ప‌డ్డారు. 

25 మంది ఎంపీల‌నిస్తే ప్ర‌త్యేక హోదా తెచ్చేస్తామ‌ని హామీలు గుప్పించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఏర్పాటు రోజునే ఢిల్లీ వీధుల‌లో చేతులెత్తేసాడ‌ని. ఇప్పుడు హోదాపై మ‌ళ్లీ పోరాడ‌తామంటూ చెపుతున్నార‌ని ఎద్దేవా చేసారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్ స‌మావేశాల‌లో 
ప్రత్యేక హోదా ఏ కాదు రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల బ‌కాయిల గురించి కూడా అడ‌గ‌లేని ప‌రిస్థితి, రాష్ట్రానికి సంబంధించి పోలవరానికీ ఒక్క రూపాయి నిధులు లేవ‌ని, ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టును సాధించలేదని ఇలా ఏ ఒక్క అంశంపైనా బ‌డ్జెట్‌పై క‌నీస ప్ర‌స్తావ‌న లేకపోవడం చూస్తుంటే జగన్ త‌న చేత‌గాని త‌నంతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని మండి ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన మేరకైనా నిధులు రాలేదంటే జగన్‌, విజయసాయిరెడ్డిలు ఢిల్లీ వెళ్లేది రాష్ట్రానికి నిధులు సాధించడానికి కాదని తేటతెల్లమైపోయింద‌ని ఎద్దేవా చేసారు.

Leave a Reply

Your email address will not be published.