ఆడ తోడు కోసం వందల కిలోమీటర్ల జర్నీచేసిన పెద్ద పులులు..

మనుషులంటే పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్లు సంబంధాలు చూడాలి. విందు వినోదాలతో ఆద్యంతం పసందుగా ఉండాలి. అది లవ్ మ్యారేజ్ అయినా సన్నిహితులుండాల్సిందే. నిజానికి తనతో జీవితాన్ని పంచుకునేందుకు ఏమనిషయినా తన మనసుకు నచ్చిన మనిషికోసం దొరికినంత వరకు వెతుకుతాడు. లేదంటే తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం పెళ్లి చేసుకుని సంసార జీవితం గడిపేస్తాడు… కానీ జంతువుల్లో అలా కాదా… వాటికి కలసి వస్తే… అన్ని లవ్ మ్యారేజి లే అనటంలో సందేహం అవసరం లేదు. మీరు వింటున్నది నిజమే… ఓ మగ పులి తనకు అనుకూలమైన స్థలంతో పాటు ఆడతోడును వెతుక్కునేందుకు ఏకంగా 150 రోజులపాటు 13 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిందంటే ఆశ్చర్య పోక తప్పదు.
వివరాలలోకి వెళితే… 2016లో తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించగా వాటికి సి 1, సి 2, సి 3 అని పేరు పెట్టారు అధికారులు. వీటిలో సి 1, సి 3లు మగ పులులు. కిషోర ప్రాయానికి వచ్చే పులులు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకుంటూ, అందుకు అన్వేషణలు ఆరంభిస్తాయి. దీని కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఈ సమయంలో వాటి ఫీలింగ్ అర్థం చేసుకున్న అధికారులు వాటి కదలికలపై నిఘా పెడుతూ వీడియో కాలర్లు అమర్చారు.
మూడేళ్లకు వయసులో ఉన్న సి 1, సి 3లు ఆడ తోడు కోసం, ప్రత్యేకమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూచెరోదారి బయలుదేరాయి.
మహారాష్ట్ర తెలంగాణలోని సి 1 అనే పులి అంబాడీ ఘాట్, కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్‌కు వచ్చింది. ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య అంతర్ రాష్ట్ర అడవులలో ఎన్నో రోజులు గడిపిన ఈ పులి ఇప్పుడు ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకుని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.
ఇక సి 3 అనే పెద్దపులి గత జూన్‌లో తిప్పేస్వామి దాటిన ఇవి పంధార్ కవాడా డివిజన్ మీదుగా తెలంగాణలోని, ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకు వచ్చింది. చివరకు బుల్ఢానా జిల్లా లోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరి అక్కడ తన ప్రయాణాన్ని ఆపిందంటే దానికి ఓ కొత్త ప్రదేశం దొరికిందనే చెప్పాలి.
వీటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించిన అధికారులు వందలాది గ్రామాలు దాటి తమ ప్రయాణం గావించిన ఈ పులులు ఎక్కడా మనుషులపై దాడికి దిగలేదని, ఆకలి వేసినప్పుడు కొన్ని పశువుల పైన మాత్రమే దాడులు చేసాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సి1 ఆరు జిల్లాల గుండా దీని ప్రయాణం సాగించిందని, దీనికి ఆడతోడు కూడా దొరికినట్టు కనిపిస్తోందని, అయితే సి3కి కొత్త స్థిర నివాసం దొరికింది కానీ తోడు దొరకినట్టు లేదని వివరించారు. కొత్త తోడు ఈ పులికి దొరకాలని మనము కోరుకుందాం.
.