బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి! – దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు

అర్జున్‌రెడ్డి, నేహాదేశ్‌పాండే జంటగా నటిన్న తాజా చిత్రం బిచ్చగాడా మజాకా. బ్రేకప్ లవ్స్టోరీ అనేది ఉపశీర్షిక. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. ఎస్.ఎ.రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన పాటలకు చక్కని స్ప ందన వచ్చింది. ఫిబ్రవరి 1న ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భ ంగా చిత్ర దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు హైదరాబాద్ లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..

కథేంటి? టైటిల్ జస్టిఫికేషన్?
*బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ం తలపెట్టిన అసాధారణ కార్యక్రమం స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది.

కథానాయకుడి పాత్రపై?
*ఈ సినిమాలో హీరో అర్జున్ యజత్ ఒక అనాధ పాత్రలో నటించారు. అతడు బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. అర్జున్ అర్థనారి అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ఆ చిత్రంలో హిజ్రా పాత్ర లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. అందుకే అతడిని కథానాయకుడిగానూ ఎంచుకున్నాం. ఏదైనా రెండు మూడు సార్లు ఆలోచిస్తాం. కానీ అతడు అన్నిసార్లు ఆలోచించడు. వెంటనే నిర్ణయం తీసుకుంటాడు. ఈ చిత్రంలో నటించిన అర్జున్ కి చక్కని భవిష్యత్ ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అతడు మెప్పించగలడని సినిమా చూశాక అర్థమవుతుంది.

బిచ్చగాళ్లు లేని నగరం.. ప్రభుత్వ కాన్సెప్టు కదా?
మేం వినిపించిన కథ విని కేటీర్ ప్రభుత్వ ం తరపున చక్కని సహకారం అందించారు.  లొకేషన్ల పరమైన ఇబ్బ ంది లేకుండా చూడడమే గాక ఉచితంగానే షూటింగులకు అనుమతిచ్చారు. సమాజం కోసం తీసిన సినిమాగా మాకు గౌరవం దక్కింది.

సుమన్ పాత్ర గురించి?
*ఈ చిత్రంలో సుమన్ విలన్ గా నటించారు. రజనీకాంత్ శివాజీ చిత్రం తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ పాత్రలో అతడు నటించారు. సంఘంలో ఈజీ గా డబ్బు సంపాదించాలనే తపనపడే యువతకు కనువిప్పు కలిగించే ఎన్నో విషయాల్ని ఈ పాత్ర ద్వారానూ చూపించాం.

కథ గురించి?
ఈ చిత్రానికి నిర్మాత స్వయ ంగా కథ అందించారు. చక్కని సెన్సిబిలిటీస్ తో అద్భుతమైన కొత్తదనం నిండిన కథను అందించారు. తన సహకారంతో సినిమాని చక్కగా తెరకెక్కించాం. సీనియర్  నటుడు సుమన్, బాబూ మోహన్, హీరో అర్జున్ యజత్ సహకారంతోనే ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కింది.

తదుపరి సినిమాలు?
చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ౠలవ్ ఈజ్ బ్లైండ్‌ౠ చిత్రానికి దర్శకత్వ ం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది. 30 శాతం బ్యాలెన్స్ ఉంది. ఫిబ్రవరి 1న ౠబిచ్చగాడా మజాకాౠ రిలీజవుతోంది. ఈ సినిమా విజయం పై ధీమాతో ఉన్నాం

Leave a Reply

Your email address will not be published.