గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు                                                                                 02 – 03 – 2020

01 . జగన్ పరిపాలన చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కెళ్ళినట్టుంది – ప్రస్తుత భాజపా నేత కన్నా …

అంటే ఏంటి బాబాయ్ – బెల్లమ్ముక్క చూపెట్టి నేల నాకించేసాడనేగా నీ శ్లేష ..??

02 .  హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో ముప్పై మంది యువ నేతలతో గెట్ టుగెదర్ – అంతా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాలని సూచన …

ఓహో – ఇహనేం మోయించుకోటానికి నెక్స్ట్ పల్లకీల బ్యాచు కూడా రెడీ అయిపోయిందన్న మాట …!!

03. అమరావతే రాష్ట్ర రాజధానిగా కొన సాగుతుందని కేంద్రమంత్రులు స్పష్టం చేసారు – భాజపా నేత కామినేని …

అట్నా – మూడో మడిషికినపడకుండా తమరి సెవిలో చెప్పినోళ్ళకి మీడియా మైకు ముందర కొచ్చి చెప్పటానికేం ….యేకాలం…??

04. సైరా సినీమాకి మా నాన్నగారు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీస్కోలేదు – రాం చరణ్ …

సొక్కా ప్యాంటూ రెండూ మనవైనప్పుడు వంద ఏ జేబులో ఉంటే ఏందిలే సామీ  …!!

05. నన్ను కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే కర్నూలు జిల్లాలో తిరగలేరంటూ మంత్రులని హెచ్చరించిన – ఓ వైకాపా ఎమ్మెల్యే …

ఊర్లోకి రాంగానే కారు టైర్లో గాలి తీసేత్తారేమో పాపం – నడవలేక సావాల – ఎందుకొచ్చిన గోల  అసలా ఊరెళ్ళటం మానేస్తే సరి…!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”

:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.