`ఎంత మంచివాడవురా` నుంచి పెళ్లి పాట

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిఅందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం `ఎంత మంచివాడవురా`. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా .ఆదిత్యా మ్యూజిక్ సంస్థ యాజమానులు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తొలిసారిగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మరో జాతీయ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందిస్తుండటం విశేషం.
కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు హిట్ కావటంతో మూడో పాటను చిత్ర యూనిట్ రేడియో మిర్చిలో విడుదల చేసారు.
“ఓ చిన్న నవ్వే చాలు పదా పలకరిద్దాం
ఓ చిన్న మాటే చాలు.. బంధాలల్లుకుందాం … అంటూ పెళ్లి పాటను అనురాగ్ కులకర్ణి, గీతా మాధురి పాబగా రామజోగయ్య శాస్త్రి రాసారు. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి కల్యాణ్ రామ్, డైరెక్టర్ సతీశ్ వేగేశ్న, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ప్రస్తుతం సామాజిక మీడియాలో ఈ పాట హల్ చల్ చేస్తోంది. పెళ్లిపాటలలో ఈ పాట ఖచ్చితంగా నిలచిపోతుందని నెటిజన్లు చెపుతున్నారు.