ప్రణయ్ తండ్రి మారుతీరావు ఆత్మహత్య..?
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సంచ‌ల‌నం సృష్టించిన  ప్రణయ్ హత్య  ప్ర‌ధాన నిందితుడైన మారుతీరావు ఆదివారం ఉద‌యం అనుమానాస్పద స్థితిలో మృతి క‌నిపించారు.  

 త‌న కుమార్తె అమృత‌ ప్రణయ్ అనే వ్య‌క్తిని ప్రేమించి వివాహం చేసుకుంద‌న్న కోపంతో సుపారీ హంత‌కుల‌తో ప్ర‌ణ‌య్‌ని హ‌త్య చేయించిన మారుతీరావు కుమార్తెను త‌న దానికి తెచ్చుకోవాల‌నుకున్నాడు. ఈ  హత్య కేసులో అరెస్ట‌యిన ఆయ‌న గ‌త కొంత కాలంగా కుమార్త అమృతను తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్ప మంటూ వివిధ ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం లేక‌పోవ‌టంతో మాన‌సికంగా బాగా కుంగి పోయాడ‌ని, ఈ క్ర‌మంలో శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న ఆర్యవైశ్య భవన్‌లో  ఆత్మహత్య చేసుకున్నాడని స‌న్నిహిత వ‌ర్గాలు చెపుతున్నాయి. 

త‌న కుమార్తె అమృత  ఒప్పుకోకుంటే ఇక ఈ కేసు నుంచి బయటపడటంఅసాధ్య‌మ‌ని, ఇప్ప‌టికే కుటుంబ ప‌రువు పోయింద‌ని  భావించిన మారుతీరావు  ఓ వ్యక్తిని కూతురి వద్దకు రాయబారిగా పంపి ఆస్తినంతా రాసిస్తానని చెప్పినా. కోర్టులో మారుతీరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేందుకు  ఆమె అంగీక‌రించ‌లేద‌ని  ఈ నేపథ్యంలో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన  బ‌లంగా వినిపిస్తోంది.  

స‌మాచారం అందుకున్న పోలీసులు మారుతీరావు శ‌వాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ఆరంభించారు. అయితే మారుతీరావు ఆత్మహత్యని  ధృవీకరించడం లేదు. విచార‌ణ‌లో అన్ని విష‌యాలు తేలుతాయంటూ స్ప‌ష్టం చేసారు. 

Leave a Reply

Your email address will not be published.