సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు “రావణ లంక “

కె సీరీస్ మూవి ఫ్యాక్టరి బ్యానర్ లో క్రిష్ సమర్పణలో క్రిష్, అష్మిత, త్రిష హీరో హీరోయిన్లుగా నిర్మిస్తున్న చిత్రానికి రావణ లంక అని పేరు ఖరారు చేశారు మురశి శర్మ, దేవ్‌గిల్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఓక సాంగ్ మినహ మొత్తం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ , మెషన్ పోస్టర్లని చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఇప్పటివరకువచ్చిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలని మించి మా రావణ లంక చిత్రం ఉంబోతోందని అన్నారు. స్క్రీన్‌ప్లే మెయిన్ పార్ట్ గా రూపొందిన ఈ సినిమాలో మురశి శర్మ, దేవ్‌గిల్ చిత్రానికి పెద్ద ఎస్పెట్ గా నిలచారని, భద్రం, రచ్చరవి కామెడి టైమింగ్ అద్భుతంగా స్క్రీన్ మీద పండిందని అన్నారు. హీరో క్రిష్ కొత్తవాడైనా చాలా బాగా చేశాడు. అష్మిత, త్రిష లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామర్ అందించారన్నారు.. ఉజ్జల్ అందించిన సంగీతం, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కుమారుడు కాలభైరవ వాయిస్ అదిరిపోయేలా ఉందని అన్నారు. అతి త్వరలో ఈ ఆడియో ని విడుదల చేస్తామని, సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చెప్పారు.