రజినీకాంత్‌ ‘వ్యూహం’లో మహానటి కీర్తితలైవా, సూపర్‌స్టార్‌ రజినీకాంత్ త‌న 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ శరవేగంగా చేస్తోంది. ‘వ్యూహం’ అనే టైటిల్ ఈ చిత్రానికి క‌థానుసారం గా బాగుంటుంద‌ని పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కాగా  త్వరలోనే రజినీ కాంత్‌ రాజకీయ రంగ  ప్రవేశం చేయనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన తన కమిట్‌మెంట్స్‌ను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెలఖారున సెట్స్‌ పైకి వెళ్లనుంది.
కాగా ఈ సినిమాలో రజినీకాంత్ స‌ర‌స‌న‌ నటించబోయే హీరోయిన్‌ ఎవరా? అనే దానిపై సోషల్‌ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మంజు వారియర్‌, కీర్తిసురేష్‌, ఖుష్బూ, మీనా తదితరుల పేర్లు వినిపిస్తుండ‌గా తాజాగా రజినీకాంత్‌ సరసన హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ అని చిత్ర నిర్మాత‌లు ఖరారు చేయ‌టం విశేషం. శివ తెరకెక్కించే ఈ చిత్రంలో కీర్తీది కీలక పాత్రలో న‌టిస్తున్న‌ట్టు విన‌వ‌స్తోంది.  
కాగా ప్రస్తుతం రజినీకాంత్  ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్  సంక్రాంతి కి విడుద‌ల కానుంది. సినిమా జనవరి 9న విడుదల అయ్యే ఈ చిత్రంలో రజినీకాంత ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో క‌నిపించ‌నున్నవిష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.