మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ తో ఇంట‌ర్వ్యూ

`పటాస్`,`సుప్రీమ్`,`ఈడో రకం..ఆడో రకం`,`రాజుగారి గది` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు స్వర సారధ్యం వహించి సినీ ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్.   మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా  శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో రూపొందుతున్న `22` సినిమాకు ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.. ఫిబ్రవరి 23 సాయి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న మీడియాకు ప్ర‌త్యేక‌ ఇంటర్వ్యూ.ఇచ్చారు. 

22 మూవీ ఎలా ఉండబోతుంది?
ప్ర‌ముఖ నిర్మాత‌, పాత్రికేయుడు బి.ఎ రాజు గారి అబ్బాయి శివ దర్శకుడిగా పరిచమవుతు చేస్తున్న‌ సినిమా `22స‌. ఇందో  యాక్షన్ థ్రిల్లర్ తొలిసారిగా ఈ త‌ర‌హా సినిమాకి సంగీతం అందిస్తున్నా.  కాన్సెప్ట్  అదిరింది. రీరికార్డింగ్  చేస్తున్నప్పుడు సినిమా చూస్తున్నంత సేపూ ఏదో తెలియ‌ని ఆనందం, అంత‌కు మించి థ్రిల్ ఫీల్ అయ్యాను. శివ త‌న‌కిది తొలిసినిమాలా కాకుండా ఎంతో అనుభ‌వ‌మున్న‌ట్టు  ఒక కొత్త తరహాలో సినిమా తీసాడు.   హీరోగా రూపేష్ కూడా బాగా న‌టించాడు. ఇద్ద‌రికీ ఈ సినిమా   ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. 

ఈ సినిమాలో సంగీతానికి ఉన్న‌ ప్రాముఖ్యత ఏంటి?
హీరో, హీరోయిన్స్  ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కావ‌టంతో  యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో  థ్రిల్లర్ సబ్జెక్టు మంచి స్కొపు ఏర్ప‌డింది .  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి  ఎక్కువ స్కోప్ ఉండ‌టంతో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాకి మంచి ఎలివేషన్స్ కుదిరాయి. అందుకే వర్క్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యాను.

సినిమాలో పాట‌ల గురించి చెప్పండి. 
ఇదో క్రైమ్ కంటెంట్ సినిమా కావ‌టంతో మూడు పాటలనీ సంద‌ర్భాను సారంగా ఉండేలా చూసాడు దర్శకుడు శివ   యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన‌`మార్ మార్ కే` పాట‌కి, అమ్మ‌ సెంటిమెంట్‌తో సాగే పాటకి    ఔట్ స్టాండింగ్  రెస్పాన్స్ వ‌స్తోంది. 

ఈరోజు  మీ పుట్టిన‌రోజు క‌దా? స్పెష‌ల్ ఏమైనా ఉందా??
– అబ్బే! మీర‌నుకునేలా స్పెష‌ల్ అంటూ ఏమీ లేదండీ బాబూ, .. 22 యూనిట్లో  సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ఇది నా 37వ పుట్టినరోజు. 

సంగీతం చిన్న‌ప్ప‌టి నుంచే అల‌వ‌డిందా?
అవునండీ, చిన్న‌ప్పుడు సినిమా పాట‌లంటే చ‌చ్చిప‌డేవాడిని. ఆ త‌రువాత సంగీతంలో కాస్త ఓనామాలు నేర్చుకున్నా, ప‌లు సంగీత ప‌రిక‌రాలు వాయించ‌డం నేర్చుకున్నాక నా తొమ్మిదవ ఏట నుండే రిథిమ్ ప్లేయర్‌ గా పనిచేసే అవ‌కాశం అందింది తరువాత సంగీత ద‌ర్శ‌కుడు విజయ్ ఆనంద్ గారి దగ్గర కొన్నాళ్లు డ్ర‌మ్మ‌ర్‌గా ప‌నిచేసా, ఆపై  దేవిశ్రీ ప్రసాద్ వరకు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర డ్రమ్మర్‌గా పనిచేసే అవ‌కాశం వచ్చింది. ఒక్కొక్క‌రిదీ ఒకో త‌ర‌హా. అదే నాకు ఎన్నో మెళుకువ‌లు నేర్పింది.   నేను కంపోజర్‌గా మారాక అవి చాలా ఉప‌యోగ ప‌డింది.

సంగీత ద‌ర్శ‌కుడిగా మీరెన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నారు. 
ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చి పదేళ్ల కెరీర్ పూర్తయింది. ఇప్పటివరకూ  75 సినిమాలకు సంగీతం సమకూర్చానంటే న‌న్ను నేనే న‌మ్మ‌లేక‌పోతున్నా.  మంచి పాటలందించాలన్న నిశ్చయం ప‌నిచేస్తున్నా, నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాట‌”నాలో చిలిపి కలా.. నీలా ఎదురైందా… ఇప్పటికి దాదాపు 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఆ పాట ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చిందో త‌ల‌చుకుంటే ఆ ఆనందానికి అవ‌ధులే లేవు.  

ఇండ‌స్ట్రీలో ఈ ప‌దేళ్ల కెరీర్  మీకు అనిపిస్తుంది?
 నాకు సంగీతం మాత్రమే తెలుసు, అదే రంగంలో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టా. అస‌లు సినిమాల‌లో హిట్ కొడితేనే వారికి  అవకాశాలుంటాయ‌ని నిల‌దొక్కుకుంటార‌ని చెప్తారు. కానీ నాకు అలా జ‌ర‌గ‌లేదు.   హిట్, ఫ్లాఫ్‌ల అనే  సంబంధమే లేకుండా నా వరకు ప్రతి సినిమాకు బెస్ట్ ఇస్తూనే వచ్చాను.  దానిని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు కాబ‌ట్టే ఇన్ని సినిమాలు చేయ‌గ‌లిగా  2014 నుంచి 16 వరకూ మూడేళ్లలో 36 సినిమాలు చేసే అవకాశం నాకు ల‌భించ‌డం అదృష్ట‌మే.   న్యాయంగా పనిచేయ‌టం ఒక ఎత్త‌యితే టైమ్, అదృష్టం కూడా ఇక్క‌డ క‌ల‌సి రావాలి.  

పాట‌ల‌లో ప‌లు ధోర‌ణ‌లొస్తున్నాయి. మీకెలా అనిపిస్తోంది? 
మీర‌న్న‌ది నిజ‌మే….గతంలో ఏదైనా ఒక మార్పు చోటు చేసుకోవాలంటే ఐదేళ్లు పట్టేది. ఇపుడు రెండు, మూడు నెలల్లో మారిపోతోంది.  సినిమా జయాపజయాలతో ప్రేక్ష‌కుల‌కు సంబంధం లేకుండా  పాట బాగుంటే చాలు మంచి గుర్తింపు ఇస్తున్నారు. దీనికి తోడు  టెక్నాలజీ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుండ‌టంతో చాలా మార్పులు వ‌చ్చేస్తున్నాయి.

మీకు స్వ‌త‌హాగా ఎలాంటి పాట‌లంటే ఇష్టం?
నావ‌ర‌కు నాకుగా అయితే  మెలోడీస్ అంటే చాలా ఇష్టప‌డ‌తాను. 22లో మంచి మెలోడీగా  మదర్ సెంటిమెంట్ పాట చాలా బాగా వ‌చ్చింది.  ఇక ప్రతి ఏటా మదర్స్ డే కి ఈ పాట ఖ‌చ్చితంగా వినిపించే స్థాయిలో ఉంది.     అయితే ఎక్కువ మెలోడీలు చేసే అవకాశం రాలేదు. మాస్ పాట‌లే ఎక్కువ చేసాను. 


ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుల‌తో మీ అనుబంధం ఎలాంటిది?
నేను అందరితో క్లోజ్‌గానే వుంటా, అయితే  మణిశర్మగారి వద్ద నేను, తమన్, వాళ్లబ్బాయి సాగర్ ముగ్గురం క‌ల‌సి ప‌నిచేయ‌టంతో మాకు మంచి అనుబంధ‌మేర్ప‌డింది.   పాటలు చేసినపుడు ఒకరికొకరు వినిపించుకుని చర్చించుకునే వాళ్లం. ది బెస్ట్ అనిపించుకునేలా ఇప్ప‌టికీ మాది ఇదే దోర‌ణి. 

త‌దుప‌రి చిత్రాలు?
–  ప్రస్తుతం ఏకే ఏంటర్‌టైన్‌మెంట్స్‌తో `బంగారు బుల్లోడు`సినిమా చేస్తున్నా. నరేష్ తో ఒక  ప్రాజెక్టు, కొత్త హీరోతో మరొకటి, అలాగే కన్నడంలో రెండు సినిమాలతో బిజీగా వున్నా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు

Leave a Reply

Your email address will not be published.