వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ

విజయ్ దేవరకొండ మరో భిన్నమైన ప్రేమకథతో ధియేటర్లకొచ్చిసందడి ఆరంభించాడు. విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మరి అంచనాలు అందుకుందా? అని ఓ సారి సమీక్షించుకోవాల్సిందే…..
కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ) మంచి రచయితగా తన కలని సాకారం చేసుకోవాలనుకుంటాడు. తమ కాలేజ్ రోజుల నుంచి యామిని (రాశి ఖన్నా) ప్రేమించుకుంటారు. అయితే రచయిత కావాలన్న లక్ష్యంతో తను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేస్తాడు గౌతమ్ . చివరికి కథారచనలో పడి తన లవర్ యామిని (రాశి ఖన్నా)ను పట్టించుకోవడం మానేస్తాడు. ఇది కాస్త గౌతమ్- యామినీల మధ్య అగాధం సృష్టిస్తుంది. యామిని తనని వదిలేసి వెళ్ళిపోయాక గౌతమ్ తనదైన శైలిలో కథలు రాయడం మొదలుపెడతాడు.
యల్లందు అనే పల్లెటూరులో శీనయ్య, సీత అనే ఇద్దరు మధ్య తరగతి భార్యాభర్తల జీవనం . ఇక వారితో పాటు కథలోకి (స్మిత) క్యాథెరిన్, ఇజబెల్ (ఇజా బెల్లె) ఎంటరవుతారు. ఈ గౌతమ్, శీనయ్యలు ఇద్దరా లేక ఒకరా? అసలు వారికి గౌతమ్, శీనయ్యలకు ఉన్న సంబంధం ఏమిటి? గతమ్ తన కల ఎలా నెరవేర్చుకున్నాడు. తన నిజజీవితంలో యామినితో ప్రేమకథ చివరికి ఎలా ముగిసింది అన్నదే వరల్డ్ ఫేమస్ లవర్.
విజయ్ దేవరకొండ నటన
విజయ్ దేవరకొండ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు, ఆతని గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా రొమాంటివ్, ఎమోషనల్ డ్రామా గా సాగుతుంది భిన్న నేపధ్యాలు, భిన్నమైన సెటప్స్ , నలుగురు హీరోయిన్లు దొరికేసరికి మరింత చెలరేగిపోయి, నటుడిగా తన విశ్వరూపం చూపాడు..నలుగురు హీరోయిన్లకు నాలుగు వేరియేషన్స్ లో ఓ పక్క తనలోని ప్లే బాయ్ పాత్రను మరోపక్క లవర్ బాయ్ గా ఓ భర్తగా అద్భుతమైన నటనను కనబర్చారు ప్రతి ప్రేమకథలోనూ దానికి తగ్గట్లే సరిపోయాడు విజయ్.. యూనియన్ లీడర్ గా , ప్యారిస్ ప్రేమికుడుగా తన మార్కు చూపాడు.
నలుగురు హీరోయిన్లు
రాశి ఖన్నాది ఈ చిత్రంలో ప్రధాన పాత్ర.. ఎక్కువగా ఎమోషనల్ యాంగిల్ కూడా ఎక్కువగా ఉంటంతో తనదైన నటనతో ప్రేక్షకులు కథలో కి తీసుకువెళ్లేలా చేసింది. ఐశ్వర్య రాజేష్ నటన విజయ్ కు పోటీగా ఉందంటే ఆశ్చర్యం కలకగ మానదు.ఓ మధ్య తరగతి జీవనం గడిపే భార్యగా మంచి నటన కనబర్చింది.అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసింది. నలుగురు హీరోయిన్లలో ఎక్కువ మార్కులు ఐశ్వర్య రాజేష్‌కే పడతాయి. దివంగత .నటుడు రాజేష్ నటవారసురాలిగా మంచి పేరు తెచ్చుకోవటం ఖాయం. క్యాథెరిన్ కు చాలా చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా నటన పరంగా మంచి మార్కులేయించుకుంది. మరో కథానాయిక ఇజబెల్ ఉన్నంతలో బాగానే చేసిందనిపిస్తుంది.. మిగిలిన వాళ్ళు నటన షరామామ్మూలే.
దర్శకుడి పనితీరు.
వరల్డ్ ఫేమస్ లవర్ తొలుత సాధారణకథలా కనిపించినా, సినిమాలో ప్రధానంగా ఎమోషన్స్ మీద దృష్టి సారించడంతో మంచి బిగువ తీసుకురావటంతో దర్శకుడు క్రాంతి మాధవ్ పరిణితి ప్రదర్శించాడు. అయితే దర్శకుడు కె క్రాంతి మాధవ్ తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది., సినిమాలో ఉన్న ప్రేమకథలలో మనకి ప్రధానంగా ఎఫెక్టివ్ గా అనిపించేవి రెండే అయినా తాను చెప్పదలచుకున్న జీవిత సూత్రం మిస్ ఫైర్ అయ్యింది. ఈ సినిమాలో మాటలు , సన్నివేశాల చిత్రీకరణ బాగున్నాయి. అర్జున్ రెడ్డి షేడ్స్ అక్కడక్కడా కనిపించాయి. స్క్రీన్ ప్లే లో చాలా చోట్ల తడబడ్డట్లు కనిపిస్తుంది. దీనిపై మరింత శ్రద్ధ చూపితే ఇంకా బాగుండేది. పైగా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువ కావడంతో ప్రేక్షకుడికి కథ విషయమై కొంత కన్ఫ్యూషన్ ఏర్పడింది. .అయితే ఓవరాల్‌గా సినిమా పరవాలేదనిపిస్తుంది.
సాంకేతిక నిపుణులు:
గోపి సుందర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు పాటలు లీలగా విన్నట్టు అనిపించినా, ఇంకా బాగా చేచ్చకదా అన్న ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగినట్టు సాగింది. . .జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, సన్నివేశాల చిత్రీకరణలో, లైటింగ్ ఎఫెక్టులలో చూపిన శ్రద్ధ చాలా నేచురాలిటీని తీసుకువచ్చింది. ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలచింది. ఆద్యంతం ఎక్కడా బోర్ కొట్టకుండా, అలా అని జంపింగ్‌లు లేకుండా, నాలుగు ప్రేమకథలని ఏర్చికూర్చిన విధానం బాగుంది.
నిర్మాణ విలువలు
తెలుగు సినీ పరిశ్రమంలో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు సమర్పణలో ఆతని కుమారుడు, నటుడు కేఏ వల్లభ అదే బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించాడు. సినిమాకు ఎంత కావాలో అంతా ఖర్చు పెట్టినట్టు తెరమీద బాగా కనిపిస్తుంది.
విశ్లేషణ:
ఇది ఓ సింపుల్ లవ్ స్టోరీ అయినా ఫస్ట్ హాఫ్ ప్రధానంగా వచ్చే సువర్ణ, శీనయ్యల మధ్య ట్రాక్ మనసును హత్తుకుంటుంది. మొదటి భాగంతో పోల్చుకుంటే సెకెండాఫ్ కొంచెం స్లోగా డల్ గా ఉందన్న భావన కలుగుతుంది. . క్లైమాక్స్ కూడా దర్శకుడు తేల్చేసినట్టు కనిపిస్తోంది. ఇదే ఈ సినిమాకి మరో వీక్ పాయింట్ . ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినప్పటికీ ప్రేక్షకుడికి కావాల్సిన . అలరించలేని సాంగ్స్, కేవలం ఎమోషనల్ గా సాగె కథ , ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్.
బలా బాలాలు
ప్లస్ పాయింట్లు :
విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్,
రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌ల నటన
శీనయ్య, సువర్ణల లవ్ స్టోరీ
మైనస్ పాయింట్లు
సెకెండ్ ఆఫ్‌లో స్లో నెరేషన్
క్లైమాక్స్
చివరిగా
కథలో కథ అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టం, క్యారెక్టర్ల డిజైన్ బాగున్నా, థియేటర్ల ప్రేక్షకుడు ఎంత వరకు అర్థం చేసుకుంటాడు అనేది చెప్పడం కష్టమే . విజయ్ దేవరకొండని లవ్వర్ బాయ్‌గా ఆశ్వాదించేవారు ఒకసారి చూడవచ్చు అనిపించేలా ఉంది