రైతు సమస్యలపై పవన్ నిరాహార దీక్ష…!

రైతు సమస్యలపై అసెంబ్లీ లో  జగన్ నోరు విప్పాలని రైతులకు న్యాయం చెయ్యాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. లేదంటే ఈనెల 12 న కాకినాడ లో నిరాహార దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు . ఆదివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలోని వెలగతోడు గ్రామము లో రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు, రైతు సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 100 మంది రైతుల్లో 60 మంది కౌలు రైతులే ఉన్నారని రైతులకు గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు పెడుతుంటే ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో తింటున్నారని విమర్శించారు. ధాన్యం విక్రయించి నెలన్నర గడుస్తున్నా రైతులకు పైసలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు రైతు రక్తంతో తడిసిన ముద్దను  తింటున్నారని అన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ధాన్యం నిల్వ చేసిన రైతులకు రసీదులు ఇవ్వడం లేదని, వెంటనే వారికి రసీదులు ఇచ్చి మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని, అసెంబ్లీలో రైతు సమస్యలపై జగన్ మాట్లాడకపోతే కచ్చితంగా తాను నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published.