దర్శకుడిగా మారనున్న నిర్మాత విశ్వనాధ్ తన్నీరు

“యమ్ 6” వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్న సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు దర్శకుడిగా మారుతున్నారు. విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఆయన తన ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ…. సినిమా మీద ఆసక్తితో ఈరంగం లోకి నిర్మాతగా అడుగుపెట్టి “యమ్ 6 చిత్రాన్ని తీసానని, ఆ చిత్రాన్ని ఆదరించడంతో దర్శకుడు కావాలనే కోరిక నెరవేర్చుకోవాలని చాలా కథలు విన్న నాకు అద్భుతమయిన కథ దొరికింది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ కథతో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతన్నట్టు చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన ఈ చిత్రంలో ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అన్నారు.
ఈ “యమ్ 6 “లో హీరోగా చేసిన ధ్రువనే ఎంపిక చేసామని, అలాగే రాగిణి, డి.యస్ .రావు , గురురాజ్ , నామాల రవీంద్ర సూరి , మాస్టర్ జైనీత్ , దిల్ రమేష్ ,శివమ్ శివరాత్రి, గిరి , తిలక్ , నర్సిరెడ్డి , చంటి , సందీప్ , కుమరం మొదలగువారు నటిస్తున్నారని చెప్పారు. 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తామని, ఫిబ్రవరి నెల మొదటి వారం హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు.