ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా పెళ్లికుమారుడు వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. సీఏఏ మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా సీఏఏ‌పై ఏవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. కాగా  కేరళలోని వాజిముక్కు ప్రాంతంలో ఓ పెళ్లికుమారుడు సీఏఏకి తన నిరసనను వ్యక్తం చేసిన తీరు అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. 

 పెళ్లి మండపానికి ఒంటెపై వచ్చిన వరుడు.. సీఏఏను తిరస్కరించండి.. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ను నిషేధించండి అని ప్లకార్డును ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపాడు.  ఇక పెళ్లి కుమారుడు హజా హుస్సేన్‌కు మద్దతుగా అతడి సహచరులు కూడా మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా వధువుకు వరుడు రాజ్యాంగ ప్రతిని బహుమతిగా అందజేశారు. సీఏఏను తిరస్కరించాల్సిందేనని హుస్సేన్‌ స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published.