`మెసెంజర్ కిడ్స్` యాప్ ఇది పిల్లలకు అవసరమా?

దీంతో ఫేస్బుక్ చిన్నపిల్లల కోసం రూపొందించిన తొలి యాప్‌ను ఇటీవలె ప్రారంభించారు. దీనిని ఉపయోగించడానికి ముందుగా తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇది వాణిజ్య ప్రకటనల కోసం సమాచారాన్ని అందించబోదని ఆ సంస్థ హామీ ఇచ్చింది. ఫేస్బుక్ ప్రస్తుతం 13 ఏళ్ల పై బడిన వారి కోసం అందిస్తున్న మెసేజ్ యాప్‌కు సరళమైన, భద్రత పెంచిన వర్షన్‌నే ‘మెసెంజర్ కిడ్స్’గా ప్రవేశపెట్టింది. ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలు ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించటానికి అనుమతించడం పెరుగుతోంది. కానీ తమ పిల్లలు వాటిని ఎలా ఉపయోగించాలి, ఎటువంటి యాప్‌లు సరైనవి అనే అంశాల పై వారికి సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి’’ అని మెసెంజర్ కిడ్స్ ప్రొడక్ట్ మేనేజర్ లో రెన్ చెంగ్ పేర్కొన్నారు.
అలాగే పిల్లలు ట్యబ్లలో ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు. అవి కూడా ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారన్నది చూసుకోవాలి. పబ్జీ లాంటి ప్రాణాంతక గేమ్స్ చాలా ప్రమాదకరమైనవి వాటిని కూడా తల్లిదండ్రులు గమనించాలి.