గోడ మీద వార్తలు

01 . యాదాద్రిలో మహా అపచారం – శిల్పులు గుడిలో స్వయంభూ విగ్రహానికీ ఉలితో చెక్కి మార్పులు చేర్పులూ చేసారని వార్తలు …

దొరే పూనుకుంటే ఉలి దెబ్బలకి కొదవా అని –
ఎందుకన్నా మంచిది…. భక్తి పారవశ్యంలో దేవుడికి దొరవారి పోలికలేమన్నా తెచ్చారేమో చూడండ్రోయ్ …!!

02. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త – 500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారిని మినహాయించి – 500 దాటితే యూనిట్ కి 90 పైసలు పెంచే ఆలోచనలో – ప్రభుత్వం…

ఏటి సేత్తాం – ఊరందరికీ ఐరన్ రాడ్డు వాడి మనకి చింత బరికె వాడటాన్నే గొప్ప వరంగా భాధించాల్సిన రోజులొచ్చేసాయి మరి …!!

03. రోడ్డుపైకి వెళ్ళిన ఆడపిల్లని ఎవడైనా ఏదన్నా చేస్తే వాడికి రెండు బెత్తం దెబ్బలు వేయండి – కానీ ఒక మనిషిని చంపే హక్కు మనెవరికీ లేదు – పవన్ కళ్యాణ్ …

ఇంకానయం  సుబ్బయ్య హోటలు నుండి బుట్ట భోజనం తెప్పించ్చి మేపి ఆ బేపి నా డాషులని ఇంటి దగ్గర దింపిరమ్మన్నావ్ కాదు …!!

04. గత మూడేళ్ళలో 128 ఇంజనీరింగు కాలేజీలని మూసేసాం – దేశంలో ఎక్కడా కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకి అనుమతులు ఇవ్వటం లేదు – కేంద్రం …

ఆల్రెడీ చదువుకున్నోళ్ళే ఫైళ్ళు చంకలెట్టుకు తిరుగుతున్నారు ఇంకా కొత్తవెందుకులే సామీ – ప్రస్తుత కాలంలో కాలేజీకెళ్ళేకన్నా కాషాయం కట్టటమే బెటర్లా ఉంది – కనీసం ఐలాండన్నా కొనుక్కోవచ్చు.. !!

Leave a Reply

Your email address will not be published.