దేవి మ్యూజిక్ పై త‌మ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

ఇటీవలే విడుద‌లైన సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు టీజ‌ర్ గురించి తెలిసిందే. ఈ టీజర్ మహేష్ ఫ్యాన్స్ కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు పూర్తి స్థాయిలో మాస్ పాత్ర‌లో  కనిపిస్తున్నారు. ఇక మ‌హేష్ డైలాగ్ డెలవరీ కూడా కొత్తగా అనిపించింది.


ఇక ఈ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ లేడీ అమితాబ్‌ విజయశాంతి. అయితే ఈ సినిమాలో ప్రేక్షకుల చేత విజిల్ వేయించే అంశాలు చాలానే ఉన్నాయని టీజర్ ద్వారానే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. మహేష్ సరసన రష్మీక నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా టీజర్ లో దేవి అందించిన మ్యూజిక్ కి మహేష్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.


మహర్షి సినిమాతో ఫ్యాన్స్ బాధపెట్టిన దేవిశ్రీ కనీసం సరిలేరు నీకెవ్వరు చిత్రంతోనైనా ఆకట్టుకుంటాడేమో అనుకుంటే.. దారుణంగా నిరాశపరిచాడు. అయితే మహేష్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా ఈ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో హ్యపీగా ఫీల్ అవ్వలేదనుకుంటా.. అందుకే టీజర్ అద్భుతంగా ఉందంటూ.. దర్శకుడు, హీరోని ట్యాగ్ చేసిన తమన్.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాంతో దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తమన్ కు నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన రంగస్థలం తర్వాత ఆ స్థాయి మ్యూజిక్ దేవి నుంచి రాలేదని చెప్పవచ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న అందించిన మ్యూజిక్ పెద్ద‌గా హిట్ అయిన దాఖ‌లాలేమీ క‌నిపించ‌డం లేదు.


ఇక‌పోతే ఇదిలా ఉంటే గ‌తంలో దేవిశ్రీ‌ప్ర‌సాద్ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో ఈ కొత్త ప్రేమ చిగురించినట్లు వార్తలు ఊపందుకున్నాయి.సినిమాలో చెర్రీకి చెల్లిలుగా నటిస్తున్న పూజితతో దేవిశ్రీ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు షూటింగ్ స్పాట్నుండి మొదలైన గుసగుసలు ఫిల్మ్ నగర్ కు పాకింది. మరి ఈసారైనా పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.