నాని నెక్స్ట్ మూవీ ముగ్గురిలో ఎవరి బేనర్ ?

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం’ జెర్సీ’.

ఈ ప్రాజెక్టు తరువాత నానితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. ఇందులో నాని నటించనుండగా, ఇక గీతా ఆర్ట్స్‌లో నాని హీరోగా ఒక సినిమా చేయడానికి దర్శకుడు మారుతి రెడీ అవుతున్నారు.
మహేష్ బాబు సోదరి మంజుల కూడా నానితో సినిమా ప్లాన్ చేస్తోంది. ఆమె అడ్వాన్స్ నాని దగ్గర ఉందట. ఇలా.. నానితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు వెంటపడుతున్నారు మరి.. విక్రమ్ కుమార్ సినిమా తర్వాత నాని దిల్ రాజు, గీతా ఆర్ట్స్, మంజుల… ఈ ముగ్గురిలో ఎవరి బ్యానర్లో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది.