నాగ్-చైతూ కాంబోలో ‘ బంగార్రాజు ‘


దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న బంగార్రాజు ప్రాజెక్టుపై ఇప్పుడిప్పుడే కదలిక వస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది.ఇది కేవలం నాగార్జున సోలో సినిమా కాదు. ఇందులో నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. అవును.. నాగ్-చైతూ కాంబోలో రాబోతోంది బంగార్రాజు.

కల్యాణ్ కృష్ణ ఈ మేరకు కథలో చేయాల్సిన మార్పులన్నీ చేశాడు. నిజజీవితంలో తండ్రికొడుకులైన నాగార్జున, నాగచైతన్య.. ఈ సినిమాలో మాత్రం తాత-మనవడు పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగచైతన్య చేయాల్సిన వెంకీ మామ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.

మనం సినిమాలో కథ ప్రకారం, నాగార్జునకు నాగచైతన్య తండ్రి అయ్యాడు. ఆ విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు. బంగార్రాజులో నాగచైతన్యకు తాతగా కనిపించబోతున్నాడు నాగార్జున. మరి బంగార్రాజు సినిమాలో ఈ ఎలిమెంట్ ను ఎలా చూపిస్తారో చూడాలి. మ‌న్మ‌ధుడు ఆ క్యారెక్ట‌ర్‌కి సూట్ అవుతాడా లేడా అన్న‌ది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.