కరోనా విలయంలో ఆంగ్ల మాథ్యమ ప్రకంపనలు

  *నేడు ప్రపంచమంతా కరోనా సృష్టించిన కల్లోలంలో విలవిల లాడుచున్నది.అగ్రరాజ్యం అమెరికా చిగురాటుకులా వణుకుచున్నది.భారతదేశం యావత్తు ముందు చూపుతో లాక్ డౌన్ ప్రకటించి అత్యధిక జనాభా కలిగిన దేశంలో మిలియన్ల జనాభాను కాపాడుతున్నారు.కాని కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ఆంథ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వం ఆంగ్లమాథ్యమం నిర్భందం చేస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు.ఏ మాథ్యమం చదవాలో విద్యార్థులు వారి తలిదండ్రులు నిర్ణయించుకుంటారు అని వ్యాఖ్యానిస్తూ,తెలుగు మాథ్యమం రద్దు రాజ్యాంగ విరుద్థమన్నారు.దీనితో సామాజిక మాధ్యమాలలో మాథ్యమం పై ప్రకంపనలు మొదలైనాయి. ఉన్నత న్యాయస్థానం తీర్పు దరిమిలా ఏ మాథ్యమం చదవాలి? అనే అంశంపై కాలాన్ని హెచ్చించి సమాజహితం కొరకు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్న మేథావులు,విద్యావేత్తలు,ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు,సమాజ హితం కోరే వారందరికి శతసహస్ర వందనాలు.సున్నితమైన మాథ్యమం అంశం పై మేథావులు కూడా రెండు వర్గాలుగా చీలి పోవడం గమన్వర్హం.మాథ్యమం పై రెండు శిబిరాలుగా విడిపోయి విషయాన్ని ప్రక్క దారి పట్టిస్తే బడుగు,బలహీన వర్గాలకు నష్టం.రాజకీయ పార్టీలు వారి,వారి అజెండా ప్రాధాన్యతలను బట్టి సమర్థన,వ్యతిరేకత ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థుల భవిషత్తుకు ఆంగ్ల మాథ్యమమే సర్వరోగ నివారణి కాదు.అయితే ప్రపంచీకరణ,ప్రైవేటీకరణ నేపథ్యంలో ఆంగ్ల మాథ్యమం చదివిన వారికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి.కమ్యునికేషన్ స్కిల్ ను బట్టి వేతనాలు ఉంటాయి.దీన్ని బట్టి ఆంగ్లమాథ్యం చదివిన వారికే ఉద్యోగావకాశాలు అని కాదు.మిగిలిన వారి కంటే కొంతమెరుగు.అందువలన ఇంగ్లీషు మీడియంకు ఎవరూ “వ్యతిరేకులు” కారు.ప్రస్తుత అవసరాల దృష్ట్యా అందరూ ఆంగ్ల మాథ్యమాన్ని నూటికి నూరు శాతం సమర్థించి తీరాల్సిందే.కాని దాని కొరకు ఉన్న దానిని “రద్దు” చేయవలసిన అవసరం లేదు.ప్రజలకు అవసరం లేని ఏ మాథ్యమం అయినా కాల గర్భంలో కలిసిపోవలసిందే.కాబట్టి  నేటి సమాజ అవసరాలకు ఆంగ్లమాథ్యమం అనివార్యమే.ఇదే సాకుతో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లమాథ్యమం నిర్భందం చేయరాదు*
    *పాఠశాలల భౌతిక పరిస్థితులు సమూలంగా మార్చాలి.నాడు-నేడు ద్వారా జరుగుతున్న ప్రయత్నాలకు అభినందనలు.ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా ప్రీకేజి లేదా ప్లే స్కూల్స్ (బాలల హక్కు చట్టాలకు వ్యతిరేకం) ప్రారంభించాలి.తెలుగుమీడియం ఉన్న ప్రాథమిక పాఠశాలకు అంగన్ వాడి అనుబంధం చేసి నర్సరీ పెట్టాలి.3సంవత్సరాలు నిండగానే బడిలో ప్రవేశానికి అనుమతి నివ్వాలి.1నుండి5 తరగతులకు ప్రతి తరగతికి ఓ టీచర్ ను నియమించాలి.తరగతిలో 25మంది దాటితే అదనపు టీచర్ ను నియమించాలి.విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండరాదు.పోషకాహారం,పారిశుధ్యం,వైద్యసదుపాయాలు పెంచాలి.పాఠశాలల  సమయాలకు ప్రజారవాణా వ్యవస్థ అన్ని మారుమూల ప్రాంతాలకు ఉండాలి.సమయపాలన పాటించాలి.కేజి నుండి10+2వరకు పూర్తి ఉచిత ప్రయాణం కల్పించాలి.6,7,8తరగతులకు మూడు భాషలు అనగా తెలుగు,హిందీ,ఆంగ్లం,ఆప్షనల్స్ అనగా గణితం,భౌతికశాస్త్రం,జీవశాస్త్రం,సాంఘిక శాస్త్రం,వ్యాయామ ఉపాధ్యాయుడు,గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు,గుమస్తా,కంప్యూటర్ అసిస్టంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్  లు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నియమించాలి.ప్రాథమిక పాఠశాల అంటే ప్రీకేజి(కిండర్ గార్డెన్) నుండి8వరకు ఉండాలి.అన్ని యాజమాన్యాలు అనగా ప్రభుత్వ, మండల పరిషత్,జిల్లాపరిపత్,మునిసిపల్ ,ఎయిడెడ్,మోడల్ స్కూల్స్ ,వివిధ సంక్షేమ పాఠశాలలు,ఆశ్రమ పాఠశాలల పలు వ్యవస్థలను రద్దు జేసి అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే గొడుగు క్రిందకు తేవాలి.విద్యాహక్కు చట్టం కుడా అదే చెబుతుంది*.

   *నిర్భందంగా ఇదే చదవాలి అని చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్థం అని ఉన్నత న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తున్నాయి.దేశంలో రాజ్యాంగం ద్వారా జరగవలసిన సవరణలు రాష్ట్రాలు చేస్తే  కోర్టులలో చాలెంజ్ చేసి అడ్డుకొని, ఆడుకుంటూ రాజకీయ పబ్బం కోసం వాడుకునే వారు పొంచి ఉంటారు.కొన్ని సందర్భాలలో భాషాభిమానులు కోర్టుమెట్లెక్కుతారు.ఇలాంటి సమయాలలో రాజకీయ దుమారం కంటే ప్రజోపయోగానికే తలొగ్గాలి.దీనిలో ఫలానా కులం,మతం,వర్గం ప్రయోజనాలకు మోకాలడ్డు అని రెచ్చగొట్టడం నిరర్థకం, అర్థరహితం.మాథ్యమం నిర్భందం వద్దు ఏది చదవాలో తలిదండ్రులు,విద్యార్థులు నిర్ణయించుకుంటారు  అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చెప్పిన దానిలోనే కర్తవ్యం బోధన ఉంది*
     *ఉపాధ్యాయుల ఏకీకృత( కామన్) సర్వీస్ రూల్స్ దశాబ్థాలు గడుస్తున్నా “ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన” తయారైంది.ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య పదవీ విమణ వలన నియామకాలు లేక నానాటికి తగ్గి పోతున్నా,సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల వాదనకే బాసటగా ఉంటున్నాయి.రాష్ట్రపతి అమోదం కూడా చట్టం ముందు నిలబడలేదంటే చట్టం వారికి అనుకూలంగా ఉండటమే.అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు.దీనితో రాజ్యాంగ సవరణలు పార్లమెంట్ మాత్రమే  చేయాలి అని నిరూపితమైంది.చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు చేసే న్యాయపోరాటానికి,మెజారిటి ఉపాధ్యాయ రంగం చేతులు ముడుచుకొని కూర్చోవలసిన దుస్థితి.దశాబ్థాలుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు.తొందర పాటుచట్టాలతోనే సమస్యలు ఉత్పన్న మౌతున్నాయి*
   
   *అన్ని ఉన్నత పాఠశాలలు 10+2 పెట్టాలి.అవసరమైతే ఉన్నత పాఠశాలల సంఖ్య కుదించి బలోపేతం చేయాలి.అన్ని ప్రభుత్వ పథకాలు ప్యభుత్వ పాఠశాలలో చదివే కుటుంబాలకే అమలు చేయాలి.ప్రభుత్వ జీతం పొందే ఆఫీస్ సబార్డినేట్ నుండి ఐఏయస్ వరకు,పంచాయతి బోర్డు మెంబరు నుండి భారత రాష్త్రపతి వరకు వారి బిడ్డలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి.కేవలం ఉపాధ్యాయులనే నిందించుట మానాలి.ఉపాధ్యాయులకు జవ సత్వాలు యిచ్చి,బోధనేతర పనుల నుండి మినహాయించి ఓ 10 సంవత్సరాలు విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్ర్య రాజ్యాంగ బోర్డు ఆధీనం లో పెడితే ప్రైవేట్ స్కూల్స్ మనుగడ ప్రశ్నార్థకమౌతుంది?.ప్రజలకు ప్రత్యామ్నామ్యం చూపితే మెల్లగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థజీవం పోసుకుంటుంది*
     *వినూత్న విధానాలతో విజయవాడ మరియు నవ్యాంథ్ర లోని చాలా మునిసిపల్ స్కూల్స్ కిటకిట లాడుతున్నాయి.కాని స్టాప్ ప్యాట్రన్ పాటించుటకు ఉపాధ్యాయ ఫోస్టులు అప్ గ్రేడ్ చేయుట లేదు.విజయవాడ నగరంలో 1992లోనే కొన్ని మునిసిపల్  పాఠశాలల్లో ఆంగ్లమాథ్యమం ప్రవేశ పెట్టారు.2007లో స్వర్గీయ రాజశేకర్ రెడ్డి గారు సక్సస్ పాఠశాలల పేరుతో ఆంగ్లమాథ్యమాన్ని పట్టణం నుండి గ్రామీణ ప్రాంతం వరకు ప్రవేశ పెట్టారు.2017లో నాటి ప్రభుత్వం మునిసిపల్ పాఠశాలలన్నింటిని ఆంగ్ల మాథ్యం లోనికి మార్చారు.ఐఐటి పౌండేషన్,కెరీర్ మార్గదర్శకత్వం,స్మార్ట్,స్పార్క్ తరగతులు నిర్వహించి విద్యార్థులలో పోటీతత్వం పెంచారు.గ్రేడ్ లు 10/10గణనీయంగా పెరిగాయి.ఉదయం,సాయంత్రం అదనపు తరగతులు హానరోరియం చెల్లించి జరిపారు.విద్యార్థులకు అదనంగా పోషకాహారం స్టడీ పీరియడ్ లలో అందించారు.దీనితో మునిసిపల్ పాఠశాలల్లో ఫలితాలు పెరగడమే కాకుండా రాశి,వాసి పెరిగింది.ఇక్కడ మాథ్యమం అంశంలో  ఏ  సందర్భంలోను వ్యతిరేకత నామమాత్రమే.ఏదీ నిర్భందం,రద్దు చేయలేదు. దేశంలో ఢిల్లీ పాఠశాలలు ప్రభుత్వ విద్యావ్యవస్థకు ఓ రోల్ మోడల్.పేద,బడుగు బలహీన వర్గాలు సగౌరవంగా పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు భరోసా కలిగింది అంటే పారదర్శకమైన విధానాలే.అక్కడ అధ్యయనాలను మన స్థానికతకు అన్వయించుకొని మెరుగులు దిద్దితే మన విద్యార్థులే భౌషత్ లో అన్నింటా అగ్రగామిగా ఉంటారు.విద్యావ్యవస్థలోకి కులాలు,మతాలు,పార్టీలు పరకాయ ప్రవేశం చేసి సమస్యను జఠిలం చేస్తున్నాయి.ప్రభుత్వ పెద్దలు బాగా ఆలోచించి మేథావులు,న్యాయ కోవిదుల సలహా సూచనలతో పేద,బడుగు,బలహీన వర్గాలకు ఆంగ్ల మాథ్యం అమలు చేయవలసిన తరుణం ఆసన్నమైంది.అదే జాతి భవిషత్తుకు దిక్సూచి*

*అప్పారావు మూకల 9440778863 ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు,విజయవాడ*

Leave a Reply

Your email address will not be published.