పాన్‌కు ఆధార్ లింక్ చేయాల్సిందే


పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా..అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించిన‌ట్టు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.  పాన్ నెంబర్‌ను 56768కి SMS చేయడం ద్వారా, ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవచ్చని సూచించింది.
 ఇంతకుముందు 2019, సెప్టెంబర్ 30తేదీలోగా లింక్ చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.  దీనిని డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచారు. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధానాన్ని తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జులై 01 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. 

ఇలా చేయండి….
రిజిస్టర్ చేయించుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 
* యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాలి. 
* ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళితే..లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది. 
* అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. 
* ఈ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోకపోయినా..కంగారు పడాల్సిన పనిలేదు. 
* ఇన్ కం టాక్స్ ఇ ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 
* హోమ్ పేజీలో ఎడమవైపు ఉన్న లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
* అక్కడ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేయాలి. 
* లేదంటే..ఈ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. 

Leave a Reply

Your email address will not be published.