భారత్‌లో కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరింది.

ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా ఇటీవలే భారతదేశాన్ని తన పంజాలో బిగించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భారత్ లో ఇప్పటి వరకు నమోదైన ఈ కరోనా బాధిత కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విన్నూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఇళ్లలోనే క్వారంటైన్‌ చేయబడిన కరోనా అనుమానితులను తొందరగా గుర్తించేందుకు ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై ఎలానైతే సిరా చుక్క అంటించిన విధంగానే కరోనా అనుమానితుల చేతిపై చెరగని సిరాతో ఎడమ చేతిపై స్టాంపులను ముద్రిస్తుంది. 

ఆ స్టాంప్‌లో ‘ముంబై ప్రజలను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని రాసి ఉంటుంది. అలాగే వారి ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలో కూడా పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఒకవేళ కరోనా అనుమానితులు స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే ఇతరులు వారిని గుర్తించేందుకు తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నుట్ట చెప్పారు. 

కాగా, గతంలో కొందరకు కరోనా అనుమానితులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మంగళవారం మృతిచెందడంతో.. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరింది.

Leave a Reply

Your email address will not be published.