నిర్భయ హంతకులకు ఉరిశిక్ష అమలుపై మళ్లీ సస్పెన్ష్

నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు గత వారం డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ రాష్ట్రపతి, ఢిల్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉరిశిక్ష అమలు చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవని తీహాడ్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కేసుపై పూర్తి నివేదికను రేపటిలోగా ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున నిర్భయ దోషులను తాము ఈనెల 22న ఉరితీయడం లేదని తీహార్ జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు.