సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అతని కుమార్తె సుకృతి ఓ సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందంట అదిఏమిటంటే….
2 years ago
ఆమధ్య జనవరి 11న బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆతని కుమార్తె సుకృతి ఓ సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. అది కూడా ఓ పాట రూపంలో నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా… ఐతే ఈ పాటకు స్వర రచన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ జనవరి 22న సుకృతి పుట్టినరోజు నాడు ఆమె పాటపై ప్రసంసలు కురిపిస్తూ, ఆపాట వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి తండ్రి కోసం పాడిన పాట వీడియో విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది` అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మెసేజ్‌ను పోస్ట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడీ పాట సామాజిక మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాట విన్నవారందరూ సుకృతి వాయిస్ బావుందని, ఆమె చాలా టాలెంటెడ్ అని ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం రంగస్థలం` వంటి భారీ సక్సెస్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కనున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఏర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో కనీసం ఒక్క పాటైనా సుకృతి పాడించాలని దేవిశ్రీ సుకుమార్‌ని అభ్యర్ధించాడట. చూద్దాం… సుకృతి సింగర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందో లేదో?